Begin typing your search above and press return to search.
కరణ్ షో లో కొత్త సంసారం గురించి స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 July 2022 2:30 AM GMTకాఫీ విత్ కరణ్ టాక్ షో ఏడవ సీజన్ ఆరంభంకు సిద్ధం అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ లో గల్లీ బాయ్ స్టార్ రణ్వీర్ సింగ్ మరియు హీరోయిన్ ఆలియా భట్ సందడి చేయబోతున్నారు. మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన హడావుడి పీక్స్ లో కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరణ్ షో లో ఆసక్తికర విషయాలను చూడబోతున్నామనే వార్తలు వస్తున్నాయి.
మొదటి ఎపిసోడ్ లోనే వావ్ అనిపించే విషయాలను కరణ్ జోహార్ గెస్ట్ లు గా వచ్చిన రణ్వీర్ సింగ్ మరియు ఆలియాల నుండి రాబట్టబోతున్నట్లుగా ప్రోమోలతోనే చెప్పకనే చెప్పాడు. కరణ్ షో అంటే మాసాలా ఎలిమెంట్స్ తో పాటు మంచి ఆసక్తికర విషయాలను కూడా సెలబ్రిటీ లు చెప్పారు. రణ్వీర్ సింగ్ నుండి పలు ఆసక్తికర విషయాలను కరణ్ రాబట్టాడు.
కరణ్ ముఖ్యంగా రణ్వీర్ సింగ్ మ్యారేజ్ లైఫ్ గురించిన ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత రణ్వీర్ లైఫ్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి... తన రూమ్ లోని వార్డ్ రోబ్ ఎలాంటి కాస్ట్యూమ్స్ తో నిడి పోయింది అనే విషయాలను గురించి చెప్పుకొచ్చాడు. ఆలియా భట్ తో పాటు రణ్వీర్ పలు విషయాల గురించి కరణ్ షో లో మాట్లాడటం జరిగింది.
దీపిక పదుకునేను పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ లో చాలా విషయాల్లో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన పాత పరిచయాలు.. కొత్త విషయాలను కూడా రణ్వీర్ సింగ్ తెలియజేశాడు. దీపిక పదుకునే ను పెళ్లి చేసుకున్న కొత్తలో ఆమె తల్లి కి నా గురించి చాలా విషయాలు తెలియక పోవడం వల్ల పదే పదే ప్రశ్నిస్తూ ఉండేవారు. కాని ఇప్పుడు ఆమె నా తల్లి వంటిది అన్నాడు.
ఇక రణ్వీర్ సింగ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి కూడా ఈ టాక్ షో లో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సర్కస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వైపు రాకీ ఔర్ రాణికి ప్రేమ కహానీ సినిమా తో వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ దక్కించుకుంటాయనే నమ్మకంతో రణ్వీర్ సింగ్ ఉన్నాడు.