Begin typing your search above and press return to search.

ఫిబ్ర‌వ‌రిలోనే రింగులు మార్చుకునేది?

By:  Tupaki Desk   |   29 Dec 2015 5:17 AM GMT
ఫిబ్ర‌వ‌రిలోనే రింగులు మార్చుకునేది?
X
ప్రియురాలి కోసం ఏం చేయ‌డానికైనా రెడీ అయిపోయేవాడిని ప్రియుడు అని ఫిక్స్ చేయాల్సిందే. ఏ ప్రియుడు అయినా ప్రేయ‌సి పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేస్తాడు. కానీ ఈ ప్రియుడు ఏకంగా ప్రియురాలి ఫాద‌ర్ బ‌ర్త్‌డేనే సెల‌బ్రేట్ చేసేశాడు. అందుకోసం దేశ విదేశాల‌లో డెస్టినీ సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేశాడు.

ప్రియురాలు షాపింగుకి వెళ్లినా, క్ల‌బ్బుకి - ప‌బ్బుకి - పార్టీల‌కు వెళ్లినా - ఎక్క‌డికి వెళ్లినా తాను వెంటే వెళ‌తాడు. అంతెందుకు అవార్డు వేదిక‌ల‌పైనే త‌న‌కి రోజాల్ని అందించి ఐ ల‌వ్ యూ చెప్పేసేంత‌టి ఎమోష‌న్‌లోకి వెళ్లిపోతాడు. తిక్క తిక్క ప‌నులు చేస్తున్న‌ట్టే క‌నిపించినా ప్ర‌తిసారీ ప్రేయ‌సి ముందు దొరికిపోతూనే ఉన్నాడు. ఒక్కోసారి ప్రియురాలు కోపంలో చెంప చెల్లు మ‌నిపించినా దానిని ప్రేమ‌గానే భావించి లైట్ తీసుకున్న సంద‌ర్భాలున్నాయ్‌. అస‌లిదంతా ఎవ‌రి గురించో ఈపాటికే అర్థ‌మై ఉంటుంది. బాలీవుడ్ హాట హీరో ర‌ణ‌వీర్ సింగ్‌ - పొడుగుకాళ్ల సుంద‌రి దీపిక ప‌దుకొన్ గురించే. ఈ ప్రేమ ప‌క్షుల ల‌వ్‌ లైఫ్ గురించి.. ఇన్ని ప్రూఫ్‌ లు ఉన్నాయ్ కాబ‌ట్టే బాలీవుడ్‌ కి చెందిన ఓ వెబ్‌ సైట్ అధికారికంగా ఓ షాకింగ్ న్యూస్‌ ని ప‌బ్లిష్ చేసింది.

ఇక అంతా అయిపోయింది. బాలీవుడ్‌ లో మ‌రో వికెట్ నేల‌కూలిన‌ట్టే. ఇంత‌కాలం తిక్క వేషాల‌తో, అల్ల‌రి చిల్ల‌రి చిలిపి చేష్ట‌ల‌తో మ‌గువల గుండెల్లో మారాజులా వెలిగిపోయిన ర‌ణ‌వీర్ ఇక ఓ ఇంటివాడైపోతున్నాడు. ప్రియురాలి నుంచి గ్రీన్‌ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. ఇరు కుటుంబాల మ‌ధ్య డిస్క‌ష‌న్స్ సాగుతున్నాయ్‌. నిశ్చితార్థం రింగులు మార్చుకోవ‌డానికి ఇంకెంతో టైమ్ లేదు. ఫిబ్ర‌వ‌రిలోనే ముహూర్తం అంటూ వార్త‌ను ప్ర‌చురించింది.

నాకు 29 వ‌య‌సు వ‌చ్చేసింది. అర్జెంటుగా ఓ ఇంటివాడినైపోవాలి. లైఫ్‌ లో సెటిలైపోవాలి అంటూ ఇటీవ‌లే త‌న మ‌న‌సులోని మాట‌ను బైటికే చెప్పేశాడు ర‌ణ‌వీర్. అది కూడా ప్రియురాలి క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి త‌దేకంగా చూస్తూ.. ఇక‌ క‌న్ఫ‌మ్ అయిపోయిన‌ట్టే మ‌రి!