Begin typing your search above and press return to search.
రన్ వీర్ దీపికల హంగామా మొదలైంది!
By: Tupaki Desk | 3 Nov 2018 7:13 AM GMTగత ఏడాది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ గా నిలిచిన విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పరిణయం తర్వాత అంతకు మించి అనే రేంజ్ లో రన్ వీర్ సింగ్-దీపికా పదుకునే పెళ్లికి రంగం సిద్ధం అవుతోంది. గత రెండేళ్లుగా దీని గురించి ఎన్ని రకాల వార్తలు ఎంత ప్రచారం జరిగినా సైలెంట్ గా ఉంటూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఒకటి కాబోతోంది. నవంబర్ 14-15 తమ వివాహపు తేదీలు అంటూ రన్ వీర్ స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైయిపోయాయి.
బెంగుళూరులో దీపికా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా జరిగే నంది పూజాతో వేడుకలు శ్రీకారం చుట్టారు. ఇది వివాహ తంతులో చేయాల్సిన మొదటి ఘట్టం. దీపిక పర్సనల్ స్టైలిష్ట్ షాలినా నాదని కాస్ట్యూమ్స్ పని చూస్తుండగా తనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ వినీత చైతన్య ద్వారా ఈ ఫోటోలు బయటికి వచ్చాయి. రన్ వీర్ కుటుంబ నేపథ్యం మహారాష్ట్రకు చెందిన సింధీ కావడంతో ఆ మేరకు ఆ వేడుకలు విడిగా జరగనున్నాయి. ఇక వివాహ వేదిక విషయానికి వస్తే ఇటలిలోని లేక్ కొమోను ఎంచుకున్నారు. దెల్ బాల్బెయానెల్లో అనే ఖరీదైన విల్లాలో ఇదంతా జరగనుంది. దాని చుట్టూ పక్కల స్థలాలు రూములు అన్ని ఈ ఫంక్షన్ కోసం భారీగా ఖర్చు పెట్టి హోల్ సేల్ గా అద్దెకు తీసుకున్నారు.
దీని తాలూకు ప్రిపరేషన్ ఏడాది నుంచే సాగుతోంది. వీళ్ళ ప్రేమ కథ వయసు ఐదేళ్లకు పైమాటే. పరిచయం పదేళ్ల నుంచే ఉన్నప్పటికీ బాగా సన్నిహితంగా మారింది మాత్రం రామ్ లీలా సినిమా నుంచే. డిసెంబర్ 1న రిసెప్షన్ తాలూకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. మొత్తానికి రెండు నెలల పాటు మీడియాతో అభిమానులకు దీపికా రన్వీర్ ల పెళ్లి కబుర్లతోనే కాలం గడిచిపోయేలా ఉంది