Begin typing your search above and press return to search.

రణవీర్ తో దీపిక.. ఏం జరుగుతోంది!?

By:  Tupaki Desk   |   28 March 2017 6:14 PM GMT
రణవీర్ తో దీపిక.. ఏం జరుగుతోంది!?
X
బాలీవుడ్ హాట్ కపుల్ అయిన రణవీర్ సింగ్.. దీపికా పదుకొనే ప్రేమ వ్యవహారం ఏమైంది? వీళ్లిద్దరూ విడిపోయారా.. లేక ఇంకా తమ ప్రేమ కంటిన్యూ చేస్తున్నారా.. లాంటి డౌట్స్ చాలానే ఉన్నాయి. రకరకాల రూమర్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇన్ని డౌట్స్ కి కారణం.. ఈ మధ్య కాలంలో వీరు ఎక్కడా కలిసి కనిపించకపోవడమే.

పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆర్డర్ వేయడంతోనే.. దీపిక-రణవీర్ లు పబ్లిక్ గా కనిపించడం లేదనే టాక్ కూడా ఉంది. రీజన్స్ ఏవైనా సరే.. కొన్ని నెలలుగా వీరి పబ్లిక్ అప్పియరెన్స్ మాత్రం జరగలేదు. తాజాగా జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్ కి కూడా.. వీరిద్దరూ విడివిడిగానే వచ్చారు. అయితే.. తాజాగా రణవీర్ సింగ్-దీపికాలు.. ఓ ఎయిర్ పోర్టులో కలిసి కనిపించిన పిక్ ఒకటి.. నెట్ లో వైరల్ గా షేర్ అవుతోంది.

ఈ ఫోటో లేటెస్ట్ దే అనేందుకు ఆధారాలేవీ లేవు కానీ.. రణవీర్ లుక్ చూస్తుంటే మాత్రం లేటెస్ట్ దే అనుకోవచ్చు. ఈ ఫోటో క్లిక్ మనిపిస్తున్న వ్యక్తిని.. రణవీర్ సీరియస్ గా చూస్తుండడం గమనిస్తే.. ఇది తాజా ఫోటోనే అయేందుకు అవకాశం ఉందని అర్ధమవుతుంది. మొత్తానికి రణవీర్-దీపికాల మధ్య విబేధాలు లేవనే మాట మాత్రం సుస్పష్టం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/