Begin typing your search above and press return to search.

పక్క పక్క ఫ్లాట్లలో ప్రేమ జంట

By:  Tupaki Desk   |   9 Jun 2017 6:19 AM GMT
పక్క పక్క ఫ్లాట్లలో ప్రేమ జంట
X
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే ఈమధ్యనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ గా ఫోర్బ్స్‌ జాబితాలో కి చేరింది. ఒకసారి ఇంటర్వ్యూ లో మీరు దేనిపై ఆలోచించకుండా ఎక్కువ ఖర్చు పెడతారు అని అడిగిన ప్రశ్నకు దీపిక టక్కున నాకు సొంత ఇల్లు అన్నా ఇంటీరియర్ డిజైన్ అన్నా చాల ఇష్టం దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పింది.

అలా చెప్పడం కాదు ఇప్పుడు ఏకంగా చేసి చూపించింది. ‘బో మోంద్‌’ అనే అపార్ట్‌ మెంట్‌ లో ఒక ఇల్లు తీసుకుంది. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 33 అంతస్తులు, మూడు టవర్లు ఉన్నాయి. ముంబయిలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్లు అవే. విశేషం ఏంటంటే.. దీపిక ప్రియడు రణవీర్ సింగ్ కూడా ఈ మద్యనే ఈమె పక్కనే ఒక అపార్ట్‌ మెంట్‌ తీసుకున్నాడు అని ముంబాయ్ మీడియా చెబుతోంది. రణవీర్ కూడా వరస హిట్లుతో 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంటూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇద్దరు సినిమాలు షూటింగ్లు మీటింగుల్లో బిజీగా ఉండటం తో కలుసుకోవడానికి టైమ్ ఉండటం లేదని.. పక్క పక్క ఇల్లు తీసుకున్నారు అని టాక్.

దీపిక - రణ్‌ వీర్‌ లు ఇప్పుడు ‘పద్మావతి’ చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరూకలిసి నటిస్తున్న మూడో చిత్రం ఇది. దీనిలో షాహిద్‌ కపూర్‌ కూడా నటిస్తున్నాడు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కాబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/