Begin typing your search above and press return to search.

షాక్‌: దీప్‌-వీర్ పెళ్లి 2019లోనా?

By:  Tupaki Desk   |   21 Sep 2018 2:20 AM GMT
షాక్‌: దీప్‌-వీర్ పెళ్లి 2019లోనా?
X
దీపిక ప‌దుకొనే - ర‌ణ‌వీర్ సింగ్ ప్రేమ‌వివాహానికి అన్నీ అడ్డంకులే. ఏ ముహూర్తాన ఈ పెళ్లి గురించి ముచ్చ‌ట మొద‌లైందో కానీ, అప్ప‌టినుంచి ఇది అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతూనే ఉంది. ఓవైపు పెళ్లి ఏర్పాట్లు సాగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు ఈ వివాహ వేడుకకు ఫలానా తేదీ ఫిక్స్ చేశాం అంటూ ప్ర‌క‌టించ‌లేని ప‌రిస్థితి. ఇన్నాళ్లు అభిమానులు ఎంతో ఓపిగ్గానే వేచి చూశారు. ఇక ఈ న‌వంబ‌ర్‌లోనే పెళ్లి బాజా మోగుతుంద‌ని అంతా భావించారు.

కానీ ఇంత‌లోనే నిరాశ క‌లిగించే వార్త‌. ఈ పెళ్లి ఈ ఏడాది ఉండ‌బోదు. 2019 వ‌ర‌కూ వేచి చూడాల్సిందేన‌న్న‌ది ఆ వార్త సారాంశం. దీప్ -వీర్ పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చురుగ్గానే సాగుతున్నా, కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ఆ మేర‌కు రిప‌బ్లిక్ టీవీలో వ‌చ్చిన క‌థ‌నం సంచ‌ల‌న‌మైంది. వాస్త‌వానికి న‌వంబ‌ర్ 20న ముహూర్తం ఫిక్స‌యిన‌ట్టేన‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. భూత‌ల స్వ‌ర్గం ఇట‌లీలోని లేక్ కోమోలో వివాహం జ‌రిపిస్తారు. బాలీవుడ్ ప్ర‌ముఖులు స‌హా కేవ‌లం 20 మంది సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో ఈ వివాహం జ‌రుగుతుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు అది కుద‌ర‌డం లేదుట‌.

అస‌లింత‌కీ ఈ వాయిదాకి ప్ర‌ధాన కార‌ణ‌మేంటి? అని ఆరాతీస్తే.. అదే నెల‌లో ఆ ఇద్ద‌రూ ర‌క‌ర‌కాల ఈవెంట్ల‌తో బిజీ అయిపోతున్నార‌ట‌. ర‌ణ‌వీర్ ఇప్ప‌టికే నాలుగు సినిమాల్లో న‌టిస్తున్నాడు. వీటికి తోడు ర‌క‌ర‌కాల అసైన్‌మెంట్స్ న‌వంబ‌ర్‌ లో ఉన్నాయిట‌. అలానే దీపిక ప‌దుకొనే సైతం ర‌క‌ర‌కాల ఆఫ‌ర్లు - ఈవెంట్ల‌తో ఆ నెలంతా బిజీ అయిపోతోందిట‌. దీంతో 2019 ఆరంభంలో పెళ్లాడుకుంటే మంచిద‌ని ఓ అండ‌ర్‌ స్టాండింగ్‌ కి వ‌చ్చార‌ని స‌ద‌రు టీవీచానెల్ క‌థ‌నం ప్ర‌చురించింది. చూస్తుంటే బిజీ పెళ్లిళ్ల సీజ‌న్ వ‌ర‌కూ వేచి చూస్తార‌న్న మాటా వినిపిస్తోంది. ర‌ణ‌వీర్ ప్ర‌స్తుతం సింబా - గ‌ల్లీ బోయ్‌ - 83 - త‌క్త్ వంటి చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.