Begin typing your search above and press return to search.

దీపిక - రణ్‌ వీర్‌ ల పెళ్లి వెన్యూ విశేషాలు

By:  Tupaki Desk   |   6 Nov 2018 3:30 AM GMT
దీపిక - రణ్‌ వీర్‌ ల పెళ్లి వెన్యూ విశేషాలు
X
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపిక పడుకునే - రన్‌ వీర్‌ సింగ్‌ ల వివాహానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 14 మరియు 15వ తేదీల్లో వీరి వివాహం అతిరథ మహారథుల సమక్షంలో జరుగబోతుంది. వీరి వివాహ వేడుకకు ఇటలీలోని ఒక భారీ రిసార్ట్‌ సిద్దం అవుతోంది. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద సరస్సు పక్కన కోమోను ఆనుకుని ఉన్న సరస్సులో వీరి వివాహం జరుగబోతుంది. ఎందరో బాలీవుడ్‌ స్టార్స్‌ కు ఈ ప్రాంతంలో రిసార్ట్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

అక్కడ వివాహంకు అత్యంత ఖర్చు అవుతుందట. ఆ విల్లాకు వెళ్లాలి అంటే కోమో సరసులో బోటులో ప్రయాణించడం ఒక్కటో మార్గం. పచ్చని చెట్లు - అందమైన పకృతిలో ప్రయాణిస్తూ ఆ విల్లాకు చేరుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుందని కొందరు అంటూ ఉన్నారు. అద్బుతమైన ఆ అనుభూతిని రన్‌ వీర్‌ - దీపికల వివాహానికి వెళ్లిన వారు పొందబోతున్నారు.

ఆ ప్రాంతంలో విల్లాలను ఎక్కువగా పెళ్లిల్లు - ఇతర పార్టీలకు తీసుకుంటూ ఉంటారట. ఆ ప్రాంతంలో ఒక్క విల్లా రోజు వారి కిరాయి 20 నుండి 25 లక్షల వరకు ఉంటుందట. దీపిక పెళ్లి జరుగబోతున్న విల్లా రోజు వారి కిరాయి 25 లక్షలకు పైగా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఇంత భారీ స్థాయిలో పెళ్లి చేసుకోబోతున్న ఈ స్టార్‌ కపుల్‌ ముంబయిలో దాదాపు 70 కోట్లతో ఒక డ్రీమ్‌ హౌస్‌ ను నిర్మించుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సాంప్రదాయ బద్దంగా జరుగబోతున్న వివాహంలో పాల్గొనబోతున్న గెస్ట్‌ ల జాబితా ఇంకా బయటకు రాలేదు.