Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ టెంపర్ ని రణవీర్ చూపిస్తాడట
By: Tupaki Desk | 16 Jan 2017 5:43 AM GMTజూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ ఎన్నేసి సెన్సేషన్స్ సృష్టించిందో తెలిసిందే. ఎన్టీఆర్ ను హిట్ పట్టాలెక్కించిన మూవీ టెంపర్. ఆ తర్వాత ఇప్పటివరకూ తన మూవీ హిట్ స్థాయి పెంచుకుంటూ జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు యంగ్ టైగర్. స్టోరీ పరంగా కూడా.. టెంపర్ కు బోలెడన్ని ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడీ టెంపర్ ను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో టెంపర్ రీమేక్ ఉండనుందట. రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే టెంపర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తో..బాలీవుడ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిర్భయ ఎపిసోడ్ ను థీమ్ గా తీసుకుని రాసుకున్న ఈ స్టోరీ.. దేశవ్యాప్తంగా ఏ నేటివిటీకి అయినా సరిపోతుందనే టాక్ ఉంది.
దర్శకుడు రోహిత్ శెట్టి ప్రస్తుతం గోల్ మాల్ 4 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటు రణవీర్ సింగ్ అయితే.. పద్మావతిలో కీలక పాత్రతో ఆకట్టుకోబోతున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో టెంపర్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రణవీర్ సింగ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ అనగానే.. బాలీవుడ్ లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/