Begin typing your search above and press return to search.
ఆ లవర్స్ కి సైకియాట్రిక్ హెల్ప్!!
By: Tupaki Desk | 5 Oct 2017 4:56 AM GMTరణవీర్ సింగ్.. దీపికా పదుకొనే.. వీరిద్దరూ రియల్ లైఫ్ లవర్స్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు వీరికే సైకియాట్రిస్ట్ తో అవసరం వచ్చింది. అంటే.. వారి మధ్య అనుబంధానికో.. ప్రేమాభిమానాలకో.. రిలేషన్ షిప్ కో వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ ఓ సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అందులో చేసిన కేరక్టర్ల ప్రభావంతో.. ఇలా సైకియాట్రిస్ట్ ను సంప్రదించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
రాణి పద్మావతి పాత్రలో దీపికా పదుకొనే ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్. ఈ ప్రభావం నుంచే ఆమె బైటకు రాలేకపోతోందట. ముఖ్యంగా భర్తతో కలిసి సజీవ దహనం(జౌహార్) అయ్యే సీన్ చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడిందట. ఆ సన్నివేశం షూటింగ్ కి ముందే.. సెట్ లోనే దీపికా పదుకొనే కళ్లనీళ్ల పర్యంతం అయిపోయిందనే టాక్ కూడా ఉంది. కానీ బాగా ప్రొఫెషనల్ అయిన దీపికా పదుకొనే.. పూర్తి స్థాయి కమిట్మెంట్ తోనే ఆ సీన్ షూటింగ్ ను పూర్తి చేసింది. అయితే.. అక్కడి నుంచి ఆమె కొంత మెంటల్ గా డిస్టర్బ్ అయిందట. ఇందుకు పద్మావతి పాత్ర కారణం అంటున్నారు. అందుక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఇప్పటికే రణవీర్ సింగ్ కూడా ఇదే సినిమాలో చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర ప్రభావం నుంచి బైటకు వచ్చేందుకు సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాడని బాలీవుడ్ టాక్. పూర్తి స్థాయి నెగిటివ్ పాత్ర కావడంతో.. ఆ ప్రతికూలత నుంచి బైటకు వచ్చేందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందట. ఒక సినిమాలో పాత్రలు చేసిన వ్యక్తులు ఇద్దరు ఇంతగా ఎఫెక్ట్ అయారంటే.. ఆయా కేరక్టర్లలో వాళ్లు ఎంతగా ఒదిగిపోయారో కదా!