Begin typing your search above and press return to search.

చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన ర‌ణ్ వీర్‌?

By:  Tupaki Desk   |   10 April 2021 2:30 AM GMT
చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన ర‌ణ్ వీర్‌?
X
'బాలీవుడ్ స్టార్ ర‌ణ్ వీర్ సింగ్ కు ఒక హ‌లో బ్ర‌ద‌ర్ ఉండేవాడ‌ట‌. చిన్న‌ప్పుడూ వీళ్లిద్ద‌రూ క‌లిసి ఎంతో స‌ర‌దాగా ఆడుకునేవార‌ట‌. కానీ.. అనుకోని సంఘ‌ట‌న‌లో వారిద్ద‌రూ విడిపోయార‌ట‌. ఆ త‌ర్వాత పెద్ద‌య్యాక క‌లిశార‌ట‌..' ఇదంతా రియ‌ల్ లైఫ్ లో అనుకుంటున్నారేమో.. రీల్ లైఫ్ లో మాత్ర‌మే! ర‌ణ్ వీర్ అప్ క‌మింగ్ మూవీ 'స‌ర్క‌స్‌' స్టోరీ బ్యాక్ డ్రాప్ ఇదేనని అంటున్నారు.

దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలిస్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింద‌ని కూడా తెలుస్తోంది. అయితే.. క‌రోనా కార‌ణంగా ద‌ర్శ‌కుడి మ‌రో చిత్రం 'సూర్య‌వంశీ' రిలీజ్ కాలేదు. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాతే. 'సర్కస్' ఆడించనున్నట్టు సమాచారం.

అయితే.. అన్నదమ్ములు విడిపోవడం.. ఆ తర్వాత పెద్దయ్యాక కలుసుకోవడం అనే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే.. రోహిత్ శెట్టి టేకప్ చేశాడు కాబట్టి.. సమ్ థింగ్ డిఫరెంట్ ఉంటుందని అంటున్నారు. మరి, ఆ స‌మ్ థింగ్ ఏంట‌న్న‌ది తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.