Begin typing your search above and press return to search.

తన లవర్, ఆమె మాజీ లవర్ సూపర్ అంటున్నాడు

By:  Tupaki Desk   |   17 Nov 2015 7:30 AM GMT
తన లవర్, ఆమె మాజీ లవర్ సూపర్ అంటున్నాడు
X
ఎంత సినిమా వాళ్లయినా సరే.. ఓ హీరో - హీరోయిన్ బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసి నటించడమంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ రణబీర్ కపూర్ - దీపికా పదుకునే మాత్రం అలాంటి ఇబ్బందేమీ పడ్డట్లు కనిపించట్లేదు ‘తమాషా’ ట్రైలర్ - ప్రోమోస్ చూస్తుంటే వీళ్ళిద్దరూ ఇప్పటికీ లవర్సేనా అన్నట్లు కెమిస్ట్రీ పండించేశారు ఈ మాజీ లవర్స్. వాళ్ల సంగతి సరే పక్కనబెట్టేద్దాం. దీపిక కొత్త లవర్ రణ్వీర్ సింగ్ ఈ సినిమా విషయంలో తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు. తన లవర్ - ఆమె మాజీ లవర్ జంట సూపర్ అని పొగిడేస్తున్నాడు. తమాషా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు మీడియాతో కబుర్లు చెబుతున్నాడు.

‘తమాషా’ సినిమాతో తనకే సంబంధం లేకపోయినా.. రణ్వీర్ ఆ మూవీ ప్రమోషన్లలో పాల్గొనడం.. అక్కడొచ్చి రణబీర్ - దీపిక జంట గురించి.. వాళ్ల కెమిస్ట్రీ గురించి మాట్లాడటం విశేషం. ‘తమాషా’ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నట్లు రణ్ వీర్ చెప్పాడు. మరి అందులో దీపిక పెదవుల్ని రణబీర్ అందుకుంటుంటే అతడి ఫీలింగ్ ఎలా ఉంటుందో మరి. ఇంకో విశేషం ఏంటంటే.. రణ్ వీర్ - దీపిక జంటగా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ ప్రమోషన్లకు రణబీర్ హాజరవుతాడట. మొత్తానికి తన లవర్, మాజీ లవర్ తో ఒకే సమయంలో సినిమాలు చేసి.. వాళ్లిద్దరినీ ఒకరికొకరు ప్రమోషన్లలో సాయం చేసుకునేలా కోఆర్డినేట్ చేయగలిగిన ఘనత దీపికకే చెల్లింది.