Begin typing your search above and press return to search.

రణవీర్ కు ట్రోలింగ్ తప్పడం లేదే

By:  Tupaki Desk   |   4 Dec 2018 7:57 AM GMT
రణవీర్ కు ట్రోలింగ్ తప్పడం లేదే
X
రీమేక్ సినిమాలతో వచ్చే చిక్కే ఇది. పోలికలు తప్పవు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' సినిమా తమిళ రీమేక్ 'వర్మ' విషయంలో విక్రమ్ కుమారుడు ధృవ్ ఫుల్ గా ట్రోలింగ్ కు గురయ్యాడు. ఎప్పుడూ తమ హీరోలను తాము తక్కువ చేసుకోని తమిళ ప్రేక్షకులు కూడా ధృవ్ ను విమర్శిస్తున్నారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాలా లాంటి సీనియర్.. టాలెంటెడ్ డైరెక్టర్ ఆ రీమేక్ ను తెరకెక్కిస్తున్నప్పటికీ ధృవ్ కు ట్రోలింగ్ తప్పలేదు.

ఇప్పడు తాజాగా 'టెంపర్' హిందీ రీమేక్ 'సింబా' విషయంలో అలాంటి రెస్పాన్సే వస్తోంది. రీసెంట్ గా 'సింబా' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ రీమేక్ ను దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. యంగ్ టైగర్ కెరీర్లో 'టెంపర్' ను ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా చూస్తారు. ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మన్సుల్లో అదొకటి. హిందీ సినిమా ఎలా ఉంటుందో ఏమోగానీ ట్రైలర్ లో మాత్రం ఆ సీరియస్ నెస్.. ఫోర్స్ కంటే కూడా వెకిలితనం ఎక్కువగా కనిపించింది. పైగా 'సింబా' ను అజయ్ దేవగణ్ 'సింగమ్' సినిమాకు లింక్ చేయడం మాత్రం 'టెంపర్' ను చూసిన జనాలకు వింతగా ఉంది.

రణవీర్ సింగ్ ఒక బ్రిలియంట్ ఆర్టిస్ట్. 'బాజీరావ్ బస్తాని'.. 'పద్మావత్' సినిమాలు చూసినవాళ్ళు ఎవరైనా ఆ విషయం ఒప్పుకుంటారు. రణవీర్ ను ఇక్కడ తక్కువ చేయడం కాదుగానీ 'టెంపర్' లో ఉండే ఒరిజినల్ ఫ్లేవర్ మాత్రం 'సింబా' లో మాత్రం మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఏదేమైనా 'టెంపర్' కు గట్టిగా మసాలా దట్టించినట్టున్నారు. మన తెలుగువాళ్ళు.. ఈ 'సింబా' ను చూసి 'బాలీవుడ్ నేటివిటీ' అని సరిపెట్టుకోవాలేమో..!