Begin typing your search above and press return to search.

స్టార్ హీరోని ఫోటో తీయమన్న జంట

By:  Tupaki Desk   |   14 Aug 2016 5:30 PM GMT
స్టార్ హీరోని ఫోటో తీయమన్న జంట
X
సినిమా తారలు ఎవరైనా కనపిస్తే.. వాళ్ల ఆటోగ్రాఫ్ తీసుకోవడం పాత స్టైల్. ఆ తర్వాత వాళ్లు సైన్ చేసిన ఫోటో తీసుకుని సంతోషించేవాళ్లు. ఇప్పుడంతా సెల్ఫీల కాలం. హీరోలు.. హీరోయిన్లు.. ఇలా సెలబ్రిటీలతో కలిసి సెల్ఫీలు తీసుకుని రచ్చ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కు మాత్రం విభిన్నమైన అనుభవం ఎదురైంది.

ప్రస్తుతం రణవీర్ సింగ్ స్విట్జర్లాండ్ లో చక్కర్లు కొడుతున్నాడు. వాణీ కపూర్ తో జోడీ కట్టిన బేఫికర్ చిత్రం షూటింగ్ కోసం స్విస్ లో ఉన్నాడు రణవీర్. ఆ సమయంలో ఓ జంట అతని దగ్గరికొచ్చింది. ఆ యువజంట తన దగ్గరకు రావడంతో ఫోటో తీయించుకోవడానికే అనుకున్నాడు రణవీర్. కానీ విచిత్రంగా వారు ఈ హీరో చేతికి ఓ కెమెరా ఇచ్చి.. తమ ఫోటో తీయమని అడిగారు. అడిగినోళ్లకి ఇతనో స్టార్ హీరో అని అప్పుడు తెలీదు. 'రణవీర్ సింగ్ మా ఫోటో తీశారు. ఆయనో పెద్ద హీరో అని మేము గుర్తు పట్టలేదు. అడిగిన వెంటనే ఫోటో తీసినందుకు థ్యాంక్స్' అంటూ ఆ ఫోటోను పోస్ట్ చేశాడా కుర్రాడు.

అంతే రణవీర్ తీసిన ఆ పిక్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయిపోయింది. అంత పెద్ద స్టార్ అయినా.. ఎలాంటి భేషజాలు లేకుండా అడిగిన వెంటనే ఫోటో తీసిన రణవీర్ సింప్లిసిటీని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. ఇక రణవీర్ తమను ఫోటో తీయడాన్ని ఆ జంట మాత్రం మర్చిపోలేకపోతోంది.