Begin typing your search above and press return to search.
మన బన్నీ దేవరకొండకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడా?
By: Tupaki Desk | 5 Nov 2022 5:33 AM GMTఫ్యాషన్ ప్రపంచపు పోకడలు నిరంతరం మారుతూనే ఉంటాయి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఆ తర్వాత కనిపించదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం వైవిధ్యం కావాలి ఇక్కడ. ప్రతిసారీ ఒకే విధంగా కనిపించే హీరోలను తెరపై చూడాలన్నా ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది. ఇంకా ఏదైనా కొత్తగా చూపిస్తారేమో అనే ఆశతో జనం థియేటర్లకు వస్తున్నారు. అలాంటి విలక్షణత వైవిధ్యం చూపించేందుకు టాలీవుడ్ లో స్టార్ హీరో అల్లు అర్జున్... యువహీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలు ఫ్యాషన్ ఐకాన్ లుగా వెలిగిపోతున్నారు. బన్నీని ఐకాన్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటున్నారు. విజయ్ దేవరకొండ సైతం ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరిస్తూ అనతికాలంలోనే ఏ ఇతర హీరో చేయనన్ని ప్రయోగాలతో దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకర్షించాడు.
ఇది వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో ఆ ఇద్దరి ఇమేజ్ ని అమాంతం మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ వరుసగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. మరోవైపు దేవరకొండ కొన్ని క్లాసిక్ అనదగ్గ ప్రకటనలతో దూసుకెళుతున్నాడు. మెబాజ్ వంటి వాటికి దేవరకొండ ముఖచిత్రంగా నిలిచాడు.
అయితే బాలీవుడ్ నుంచి కూడా ఆ ఇద్దరికీ బోలెడంత స్ఫూర్తి ఉంది. అక్కడ విలక్షణ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ ఫ్యాషన్ పరంగా చేసే ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అతడు హిందీ పరిశ్రమలో కేంద్రక ఆకర్షణగా మారాడంటే తనవైన ఫ్యాషన్ ఎంపికల వల్లనే. ఇతర హీరోలతో పోలిస్తే పాపులర్ బ్రాండ్లకు ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ప్రచారం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నాడు. కొన్ని స్పోర్ట్స్ బ్రాండ్లతో పాటు అతడు ప్రఖ్యాత ఇటాలియన్ బ్రాండ్ గూచీతోను భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. గూచీతో అతడి వార్షికాదాయం భారీగా పెరిగిందని ఒక అంచనా. ఇక ఈ బ్రాండ్ తో అతడు దశాబ్ధ కాలంగా సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. రణవీర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు గూచీ తాలూకా ఆకర్షణను ఎలా విస్తరించాడు? అన్నది కూడా ఆసక్తికరం.
బాలీవుడ్ సూపర్ స్టార్ .. ఫ్యాషన్ సూపర్ నోవాగా రణవీర్ సింగ్ దిగ్గజ ఇటాలియన్ సూపర్-లగ్జరీ బ్రాండ్ గూచీకి మేలైన ఎంపికగా మారాడు. అతడి క్రియేటివ్ స్టైల్ .. ప్రభావవంతమైన.. వినూత్నమైన.. ప్రగతిశీలమైన... పాథ్ బ్రేకింగ్ పరిశీలనాత్మకత... చాలా యూనిక్. మనసులపై తీవ్ర ప్రభావం చూపే స్టైల్ ని అతడు ఆవిష్కరించాడు.
గూచీ బ్రాండ్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోందంటే అది రణవీర్ ఎనర్జీ వల్లనే. భారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మక వైవిధ్యం కోసం గూచీతో కలిసి అతడు చేసిన ప్రయోగాలు అసాధారణం. నిజం చెప్పాలంటే రణ్ వీర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గూచీ వైపు ఆకర్షించేలా చేసాడు. ఎందుకంటే బ్రాండ్.. దాని హెడీ స్టైల్ కోటియన్ తో ఇంతకుముందు ఉబెర్-లుక్స్ ఖాతాదారుల (పోష్ గా ఉండే యూత్) కు మాత్రమే కనెక్టయింది. రణవీర్ చేరికతో అదంతా మారిపోయింది.
రణ్ వీర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో తనకున్న ప్రజాదరణతో గూచీని ప్రతి ఇంట్లో చర్చించుకునేలా చేసాడు. అతను ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో అద్భుతమైన గూచీ రూపాన్ని ధరిస్తాడు. ఒకదాని తర్వాత ఒకటిగా మారుస్తాడు. బ్రాండ్ ను ధరించి తన విలక్షణ ఫ్యాషన్ పోకడలతో ఇంటర్నెట్ లో యువతరం మనసులను గెలుచుకున్నాడు. ఇంతకుముందు గూచీ క్రియేటివ్ డైరెక్టర్ అలెశాండ్రో మిచెల్ ని షూట్ లో ప్రసారం చేయడం ద్వారా రణవీర్ ఇంటర్నెట్ ను ఎలా బ్రేక్ చేశాడో గుర్తు చేసుకోవాల్సిందే.
గూచీ దుస్తులకు తగ్గట్టు తన రూపాన్ని అతడు పూర్తిగా మార్చేస్తాడు. అది వెస్ట్రన్ స్టైల్ అయినా భారతీయ హంగును జోడించి మెప్పిస్తాడు. ఐకానిక్ పొడవాటి జుట్టు తో.. వెడల్పుగా ఉన్న టోపీ ని ధరించి... స్టేట్ మెంట్ నగలను ధరించి రణ్ వీర్ తన అద్భుతమైన గూచీ లుక్ కోసం వందకు వంద స్కోర్ చేశాడు. అతను ఐకానిక్ అడిడాస్ x గూచీ కలెక్షన్ కి కూడా ముఖచిత్రంగా ఎంపికయ్యాడు. ఎందుకంటే అతను యువతరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సేకరణ నుండి తనకు ఇష్టమైన కొన్ని లుక్ లను ఆవిష్కరించాడు. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన హైప్ ని సృష్టించిన ఘనత రణవీర్ కే చెందుతుంది.
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న లగ్జరీ మార్కెట్ లో మరింత బ్రాండ్ ప్రతిధ్వనిని నిర్మించడానికి గూచీకి రణవీర్ ఉత్తమ అంబాసిడర్. FIFA వరల్డ్ కప్.. NBA.. ప్రీమియర్ లీగ్.. UFC... YAS ఐలాండ్.. అడిడాస్ మొదలైన భారీ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న అతడు.. పశ్చిమ దేశాలకు భారతదేశ సాంస్కృతిక రాయబారిగా మారాడు. రణ్ వీర్ దేశంలోని యువత అతని ఫ్యాషన్ స్టైల్ ని అమితంగా ఆరాధిస్తారు. నేడు భారతీయ యువత వెస్ట్రన్ ఫ్యాషన్ స్టైల్ ను అనుకరిస్తున్నారంటే దానికి కారకుడు రణవీర్.
అతడు గూచీని ధరించి ప్రమోట్ చేయడం ప్రారంభించినప్పటి నుండి ఈ బ్రాండ్ పై భారతీయులకు ఉన్న ఆసక్తి అమాంతం పెరిగింది. కాబట్టి గూచీ రణ్ వీర్ లు కలిసి ధీటైన వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం కలిసి పని చేస్తుండడం ఆసక్తికరం. భారత్ - దాదాపు 150 కోట్ల (1.4 బిలియన్ల) మంది జనాభా కలిగిన దేశం .. వీరిలో ఎక్కువ మంది యువత యువకులేననేది సర్వే. అంతమందికి రణవీర్ ఫ్యాషన్ కనెక్టవుతుంది కాబట్టి ఈ సంస్థ అతడికి కోట్లలో ప్యాకేజీలు చెల్లిస్తోంది. ఏడాదికి దాదాపు రూ.40 కోట్లు పైగానే అతడితో గూచీ డీల్ ఉంటుందని టాక్ ఉంది.
ఇక రణవీర్ ఫ్యాషన్ స్టైల్ ని సాంప్రదాయ వాదులు అర్థం చేసుకోవడం అంత సులువేమీ కాదు. అతడు దేశాన్ని దేశంలో యువతను భృష్టుపట్టిస్తున్నాడని భావించేవాళ్లు విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ అది అతడికి వందల కోట్ల వ్యాపార డీల్. అందువల్ల అతడు సాంప్రదాయ వాదులను క్షమించమని అడగగలడు తప్ప బ్రాండ్ ప్రమోషన్ ని వదులుకోడు!
ఇకపై టాలీవుడ్ లో ప్రభావవంతమైన హీరోల్లో ఫ్యాషన్ పరంగా ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.... విలక్షణ ఫ్యాషన్ ని అనుకరించే ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ రణవీర్ స్ఫూర్తితో దక్షిణాదికి సరికొత్త ఫ్యాషన్ ని పరిచయం చేస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.