Begin typing your search above and press return to search.

అభిమాని పనికి ఫిదా అయిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   11 Jan 2020 1:30 AM GMT
అభిమాని పనికి ఫిదా అయిన సూపర్‌ స్టార్‌
X
హీరోల దృష్టిలో పడేందుకు అభిమానులు చాలా పనులు చేస్తూ ఉంటారు. కొందరు చిల్లర పనులు చేస్తూ ఉంటే మరికొందరు సీరియస్‌ పనులు చేస్తూ ఉంటారు. కొందరు తమ ఒంటిపై వారి పేర్లను పర్మినెంట్‌ టాటూలుగా కూడా వేయించుకుంటారు. ఎంతో మంది స్టార్స్‌ పేర్లను అభిమానులు వేయించుకున్నారు. అయితే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ పేరును ఒక అభిమాని వీపుపై వేసుకున్నాడు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రణ్‌ వీర్‌ సింగ్‌ కు మద్యలో ఆ అభిమాని కనిపించాడు.

ఆ అభిమాని తాను వేసుకున్న టాటూను చూపించేందుకు ప్రయత్నించాడు. షర్ట్‌ ను కిందకు అనుకుని రణ్‌ వీర్‌ కోసం వెయిట్‌ చేశాడు. రణ్‌ వీర్‌ అతడిని చూసి కొద్ది సెకన్లు అక్కడ ఆగి అతడి షర్ట్‌ ను మరింతగా కిందకు అనేందుకు ప్రయత్నించాడు. అతడి వీపుపై ఉన్న తన పేరును మరింతగా మీడియా జనాలకు చూపించాడు. ఆ సమయంలో రణ్‌ వీర్‌ సింగ్‌ చిన్న పిల్లాడిగా ప్రవర్తించి అల్లరి వాడుగా మారిపోయాడు.

మొత్తానికి అభిమాని వీపుపై తన పేరును చూసుకున్న రణ్‌ వీర్‌ సింగ్‌ ఫిదా అయినట్లుగా ఆయన ఎక్స్‌ ప్రెషన్స్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. రణ్‌ వీర్‌ సింగ్‌ ప్రస్తుతం '83' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 1983లో ప్రపంచ కప్‌ తీసుకు వచ్చిన కపిల్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కపిల్‌ పాత్రలో రణ్‌ వీర్‌ సింగ్‌ కనిపించబోతున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.