Begin typing your search above and press return to search.

ద్విపాత్రాభినయంతో ర‌ణ‌వీరుడు స‌ర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   15 Oct 2022 11:30 PM GMT
ద్విపాత్రాభినయంతో ర‌ణ‌వీరుడు స‌ర్ ప్రైజ్
X
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి మాస్ మసాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో పాపుల‌ర‌య్యాడు. కాప్ డ్రామాలు .. పోలీస్ విశ్వం అంటూ అత‌డు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ టెంప‌ర్ ని రణ్‌వీర్ సింగ్ తో `సింబా`గా రూపొందించి హిట్టు కొట్టాడు.

ఆ తర్వాత వీరిద్దరూ `సర్కస్`తో వస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా ఆవిష్కరించారు. ఇందులో ర‌ణ‌వీర్ ని రెండు విభిన్న‌మైన గెట‌ప్పులు వైవిధ్య‌మైన ఆహార్యంతో చూపించ‌బోతున్నార‌ని పోస్ట‌ర్ చెబుతోంది. ఇదే నిజ‌మైతే హీరో రణ్ వీర్ త‌న కెరీర్ లోనే సింగ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని భావించాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రణ్ వీర్ ను రెండు విభిన్న గెటప్ లలో చూపించారు. అయితే స్వ‌ల్పంగా మాత్ర‌మే రూపురేఖ‌ల‌ను మార్చారు. ఆ ఇద్ద‌రూ క‌వ‌ల‌లుగా క‌నిపిస్తార‌ని ఊహించ‌వ‌చ్చు.

ఇందులో రణ్ వీర్ తో పాటు హాస్యనటుడు వరుణ్ శర్మ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పూజా హెగ్డే - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర‌స్ నాయికలుగా అల‌రించ‌నున్నారు. మొత్తంమీద ఫస్ట్ లుక్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఇందులో కొంత రెట్రో స్టైల్ ఎలివేట్ అయ్యింది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాతలు ఈ సంవత్సరం క్రిస్మస్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి మూడు వారాల ముందే విడుద‌ల చేస్తే క‌లిసొస్తుంద‌ని ప్లాన్.

రోహిత్ శెట్టి పిక్చర్స్ - టి సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా స‌ర్కస్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ట్రైలర్ దీపావళి పండుగకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ర‌ణ‌వీర్ న‌టించిన ఇటీవ‌లి చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. కంబ్యాక్ కోసం అత‌డు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.