Begin typing your search above and press return to search.
దీపిక బాయ్ ఫ్రెండ్స్ ఒకటయ్యారే..
By: Tupaki Desk | 28 Nov 2017 7:34 AM GMTబాలీవుడ్ లో తారల మధ్య తెలియకుండా కొన్ని విద్వేషాలు కోపాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే లోలోపల అవి దాగి ఉన్నా పైకి మాత్రం అస్సలు చూపించకుండా నటిస్తుంటారు. చాలా మంది నటి నటులు ఈ తరహాలో ప్రవరిస్తుంటారని ప్రముఖులే చెబుతుంటారు. విషయం ఏదైనా కావొచ్చు తారల మధ్య తెలియకుండానే కనిపించని వివాదాలు చాలానే చోటు చేసుకుంటాయి. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి మాత్రం ఎప్పుడైనా నచ్చని వారు ఎదురైతే నవ్వుతు కనిపిస్తారు.
అయితే రీసెంట్ గా ఓ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్ మాత్రం ఎంచక్కా ఫుట్ బాల్ ఆడుతూ కనిపించరు. బాలీవుడ్ లో ఈ మధ్య తారలు ఫుట్ బాల్ ఎక్కువగా ఆడుతోన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా వారితో క్రికెటర్స్ కూడా కలుస్తున్నారు. కొన్ని మంచి కార్యక్రమాల కోసం వారు ఫుట్ బాల్ ఆడుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ హాట్ బ్యూటీ.. రాణి 'పద్మావతి'.. దీపిక పదుకొణె మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ప్రస్తుతం ఉన్న బాయ్ ఫ్రెండ్ రన్వీర్ సింగ్ లు ఇద్దరు కలిసి ఫుట్ బాల్ ఆడారు.
వీరిద్దరూ బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న స్టార్స్. కానీ ఎక్కువగా కలుసుకోరు. వీరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయని చాలాసార్లు మీడియాలలో కథనాలు కూడా వచ్చాయి. అయినా కూడా రాణి గారి రాకుమారులు గతాన్ని రూమర్స్ ని పట్టించుకోకుండా ఆటను ఆస్వాదించడం చూస్తుంటే చాలా కొత్తగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం వారి ఆటకు సంబందించిన ఫొటోలు వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.