Begin typing your search above and press return to search.
రణవీర్ సింగ్ హీరోయిన్ లా మారిపోతున్నారా?
By: Tupaki Desk | 7 March 2022 11:30 PM GMTఫేమస్ మేకప్- ప్రొస్తటిక్ ఆర్టిస్ట్ ప్రీతి షీల్ సింగ్ డిసౌజా గురించి పరిచయం అవసరంలేదు. రాక్ స్టార్ రణబీర్ కపూర్..రణవీర్ సింగ్ సహా పలువురు సెలబ్రిటీల ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ డిసౌజా. హీరోలను ఆన్ స్ర్కీన్ పై అందంగా చూపించడంలో ప్రీత్ షీల్ పాత్ర ఎంతో కీలకమైనది. హీరోలని ఎలాంటి గెటప్ ల్లోనైనా అవలీలగా మార్చగల నేర్పరి. అందుకే బాలీవుడ్ లో అంత ఫేమస్ అయ్యారు. ఎక్కువగా ఆమె యాడ్ షూడ్ లకు పనిచేస్తుంటారు.
అప్పట్లో రణబీర్ కపూర్ యాడ్ కోసం పూర్తి స్థాయిలో ప్రొస్తటిక్ మేకప్ ధరించారు. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు పూర్తిగా మహిళ వేషధారణలో కనిపించారు. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది. కొన్ని గంటల పాటు శ్రమిస్తే తప్ప అలాంటి లుక్ తీసుకురాలేరు.
దానికి సంబంధించి తమ శ్రమ ఎలా ఉంటుందన్నది ఓ వీడియో రూపంలో ప్రీత్ షీల్ వివరించే ప్రయత్నం చేసారు. అప్పట్లో అది వైరల్ గా మారింది. దీంతో ప్రీత్ షిల్ ని ప్రశంసించని బాలీవుడ్ సెలబ్రిటీ లేరు అంటే అతిశయోక్తి కాదు.
తాజాగా ఈసారి యాడ్ షూడ్ కోసం రణవీర్-ప్రతీషీల్ కలిసారు. రణవీర్ సింగ్ కి మేకప్ వేస్తోన్న ఓ ఫోటోని ప్రీత్ షిల్ ఇన్ స్టాలో షేర్ చేసారు. ఈ సందర్భంగా రణవీర్ అసాధారణ ప్రతిభని ఆకాశానికి ఎత్తేసారు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతిని చ్చిందన్నారు. క్రేజీ హీరోలతో పనిచేస్తుంటే సమయం తెలియదన్నారు.
అదీ వర్క్ డెడికేషన్ ఉన్న వాళ్లతో పనిచేయ డం వల్ల ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చాన్నారు. అయితే ఈ యాడ్ షూట్ వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. మరి రణబీర్ లా రణవీర్ ని కూడా అమ్మాయి గెటప్ లో కి మారుస్తారో! ఏమో!
ఇక రణవీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే `సిర్కస్`..` రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. `జయేష్ భాయ్ జోర్డార్` చిత్రీకరణ పూర్తి చేసారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే రిలీజ్ కానుంది. దివ్యాంగ్ తక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.