Begin typing your search above and press return to search.
ఆ సీన్ లో ఎన్టీఆర్ ని దించేస్తున్నారు
By: Tupaki Desk | 18 Jun 2018 5:43 AM GMTటాలీవుడ్ లో టెంపర్ మూవీ ఓ సెన్సేషన్. ఎన్టీఆర్ ను మళ్లీ హిట్టు పట్టాలెక్కించిన ఈ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగింది. ముఖ్యంగా యంగ్ టైగర్ యాక్టింగ్ సత్తాను జనాలకు మరోసారి తెలియచెప్పింది. స్ట్రాంగ్ స్టోరీ కావడంతో.. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు అనేక భాషల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని సెట్స్ పై కూడా ఉన్నాయి.
టెంపర్ రీమేకులలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ వెర్షన్ గురించే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శింబా అనే టైటిల్ సెట్ చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి అల్ట్రామోడర్న్ లవర్ వరకు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే రణవీర్ సింగ్.. టెంపర్ రీమేక్ లో నటిస్తుండడంతో.. టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఆసక్తిగానే ఉంది. డిసెంబర్ 28న రిలీజ్ కి షెడ్యూల్ చేసిన ఈ చిత్రానికి.. ఇప్పటికే ప్రచార హంగామా కూడా స్టార్ట్ చేసేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్.. వెంటనే ఎన్టీఆర్ ను గుర్తు చేసేస్తోంది.
టెంపర్ మూవీలో చాలా సీన్స్ పోలీస్ స్టేషన్ లో ఉంటాయి కానీ.. పోలీస్ స్టేషన్ సీన్ అంటే మాత్రం గుర్తుకొచ్చేది.. సీడీ కోసం విలన్స్ స్టేషన్ కు వచ్చే సన్నివేశమే. ఆ సీన్ కు సంబంధించిన ఓ పిక్ నే ఇఫ్పుడు రిలీజ్ చేశారు. రణవీర్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయినా.. మన జనాలకు మాత్రం ఇది ఎన్టీఆర్ ను దించేసినట్లుగానే అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దయా పాత్రను యంగ్ టైగర్ ఆ రేంజ్ లో మెప్పించేశాడు మరి.