Begin typing your search above and press return to search.
ఇకనైనా బతకాలని అనుకుంటున్నా
By: Tupaki Desk | 2 Jan 2016 7:30 PM GMTన్యూ ఇయర్ లో న్యూ రిజొల్యూషన్స్ తీసుకోవడం సాధారణమే. సామాన్యులే కాదు.. స్టార్ హీరోలైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరి 2016 కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటో తెలుసా.. ఇకపై చనిపోకూడదని అనుకుంటున్నాడట.
ఇకమీదట చనిపోకూడదు అంటే.. ఇంతకు ముందు ఇలా అనుకున్నాడని కాదు. యాక్చువల్ గా రణ్ వీర్ ఇప్పటికి చాలాసార్లు చనిపోయాడు సినిమాల్లో. లుటేరా - గుండేలతో పాటు.. రీసెంట్ గా రిలీజ్ అయిన బాజీరావు మస్తానీలో కూడా ఇదే సిట్యుయేషన్. బాజీరావుగా మరాఠా యోధుడి కేరక్టర్ లో నటించిన రణ్ వీర్.. తన నిజ జీవిత ప్రియురాలు దీపికా పదుకొనే - ప్రియాంక చోప్రాలతో కలిసి చేశాడు. ఈ సినిమాను వాళ్లమ్మ చూడకుండా ఉండాలని అనుకున్నాడట. కానీ బాజీరావు మస్తానీ మూవీ చూసిన రణ్ వీర్ తల్లి.. చాలా బాధపడిందట. చివర్లో మరణించే సన్నివేశం చూసి కన్నీరు పెట్టుకుందట. దీంతో ఇలా క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలకు ఇకపై గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్లు చెప్పాడు రణ్ వీర్ సింగ్.
అది సినిమానే అయినా.. తల్లిని బాధ పెట్టడం ఇష్టంలేకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అమ్మకి నచ్చని పని చేయకుండా ఉండేందుకు ఈ డెసిషన్ తీసుకున్నానని, డైరెక్టర్లు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా అన్నాడు రణ్ వీర్ సింగ్. ఇకపై అయినా.. నేను చేయబోయే సినిమాల్లో బతుకుతానేమో చూద్దాం అంటున్నాడు.