Begin typing your search above and press return to search.
నగ్న ఫోటోషూట్ స్త్రీలు చేస్తే ఊరుకుంటారా? నిలదీసిన నటి!
By: Tupaki Desk | 23 July 2022 2:30 AM GMTఫ్యాషన్ ప్రపంచపు పోకడలను బోల్డ్ గా పరిచయం చేయడంలో ముందుండే హీరో రణవీర్ సింగ్. ఇతర హీరోలతో పోలిక లేకుండా నిరంతరం తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడం అతడికే చెల్లింది. విమర్శలు వివాదాలు వెక్కిరింతలను కూడా కేర్ చేయకుండా ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం కోసం అతడు తపిస్తాడు. వెరైటీ అంటే ఏంటో చూపిస్తాడు. ఈసారి ఏకంగా నగ్న ఫోటోషూట్ తో వివాదాలకు తెర లేపాడు.
రణవీర్ సింగ్ తన చమత్కారమైన వింతైన ఫ్యాషన్ స్టేట్ మెంట్లతో నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నా తాజా నగ్న యాక్ట్ అందుకు పూర్తి భిన్నమైనది. అతడు ప్రఖ్యాత మ్యాగజైన్ కోసం నగ్న ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. అతని బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో భారీ సంచలనాన్ని సృష్టించాయి. ప్రజలు అభిమానులు ఎవరికి వారు దీనిపై అభిప్రాయాలు చెబుతున్నారు.
ఇప్పుడు బెంగాలీ నటి కం రాజకీయ నాయకురాలు మిమీ చక్రవర్తి ట్విట్టర్ లో రణవీర్ నగ్న ఫోటోషూట్ గురించి తాను ఏమనుకుంటుందో వెల్లడించింది. రణవీర్ చేసిన పనిని ప్రశంసిస్తూనే.. లింగ సమానత్వ సమస్య గురించి ఆమె సూటిగా ప్రశ్నించారు. తన ట్వీట్లలో ఇలాంటి ఫోటోషూట్ లో పాల్గొంటే ఎవరైనా ఒక స్త్రీకి కూడా అదే స్పందన లభిస్తుందా? అంటూ మిమీ ప్రశ్నించింది. ``రణ్ వీర్ సింగ్ తాజా ఫోటోషూట్ తో ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. వ్యాఖ్యలు (ఫైర్ ఎమోజీలు) హుషారుగా ఉన్నాయి. ఇలా చేసినది ఒక స్త్రీ అయితే ప్రశంసలు ఇలాగే ఉండేవా?`` అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
మీరు ఆమె ఇంటిని తగులబెట్టి తనను చంపేస్తామని బెదిరించి.. వ్యభిచారి అంటూ అవమానించారా? అని ఒక ట్వీట్ లో ప్రశ్నించారు. మరొక ట్వీట్ లో మిమీ ఇలా రాశారు. ``మేము సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అది ఎక్కడ ఉంది ?! మీకు బాగా తెలుసు.. మీ దృక్పథం దేనినైనా మార్చగలదు లేదా పూర్తిగా నాశనం చేయగలదు. అతని విషయంలో మన ధృక్పథాన్ని విస్తృతం చేద్దాం. ఎందుకంటే అలాంటి శరీరం (లుక్) చాలా త్యాగం చేస్తేనే వస్తుంది. నన్ను నమ్మండి.. ఉప్పు లేదు.. చక్కెర లేదు.. పిండి పదార్థాలు లేవు.. కానీ అలాంటివి మాత్రమే తిని కష్టపడాలి`` అని అన్నారు మిమీ.
1972లో మ్యాగజైన్ షూటింగ్ లో నగ్నంగా కనిపించిన 70ల పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ కు రణవీర్ నివాళి అర్పిస్తూ నగ్న ఫోటోషూట్ లో కనిపించాడు. ప్రస్తుతం రోహిత్ శెట్టి సర్కస్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. రణవీర్ సరసన పూజా హెగ్డే- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కథానాయికలుగా నటించారు.