Begin typing your search above and press return to search.
నగ్న ఫోటోషూట్.. స్టార్ హీరో పై పోలీసుల ప్రశ్నల వర్షం!
By: Tupaki Desk | 31 Aug 2022 2:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ కొద్దిరోజుల క్రితం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం తన న్యూడ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో హంగామా సృష్టించాడు. దీనిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్ లోను అతనిపై ఫిర్యాదు చేసింది.
రణవీర్ ఆగష్టు 22న విచారణ కోసం హాజరు కావాల్సి ఉండగా.. దాని కోసం మరో రెండు వారాలు ఆగాలని పోలీసులను అభ్యర్థించాడు. తాజా సమాచారం మేరకు.. సోమవారం రణవీర్ ని పోలీసుల ఎదుట హాజరుపరిచి 2 గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం.
సోమవారం ఉదయం 7 గంటలకు ముంబై పోలీసుల ఎదుట హాజరైన ఆయనను అధికారులు ప్రశ్నించారు. వివాదాస్పద ఫోటోలను తాను అప్ లోడ్ చేయలేదని.. ఆ ఫోటోలు తనకు ఇబ్బందిని సృష్టిస్తాయని తనకు తెలియదని అతడు చెప్పాడు. ముంబయి పోలీసులు అతడిని మళ్లీ విచారణ కోసం పిలుస్తారని సమాచారం.
రణవీర్ సింగ్ సాధారణంగా మహిళల మనోభావాలను దెబ్బతీశాడని .. తన ఫోటోల ద్వారా వారిని కించపరచడమే గాక.. అవమానించాడని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. 292 (అశ్లీల పుస్తకాల అమ్మకం మొదలైనవి).. 293 (యువకులకు అసభ్యకరమైన వస్తువులను విక్రయించడం).. 509 (మహిళ యొక్క అణకువను అవమానించేలా ఉద్దేశించిన పదం.. సంజ్ఞ లేదా చర్య) వంటి అనేక భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. IT చట్టంలోని సెక్షన్ 67Aతో పాటుగా భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం స్త్రీలను కించపరిచే చర్యకు అతడు శిక్షార్హుడు అని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.
రణవీర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదయ్యాక.. దీనిపై ముంబై పోలీసుల బృందం నోటీసులు అందించడానికి ముందు రోజు రణవీర్ నివాసాన్ని సందర్శించారు. అయితే పోలీసులు వచ్చేసరికి రణ్ వీర్ ఇంట్లో లేరని తెలిసింది. ఆ తర్వాత ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఎట్టకేలకు రణవీర్ పోలీసుల ఎదుట హాజరవ్వగా తదుపరి విచారణకు కూడా అతడు హాజరు కావాల్సి ఉంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రణ్‌వీర్ సింగ్ నటించిన 83 - జయేష్ భాయ్ జోర్ధార్ లాంటి భారీ చిత్రాలు ఇటీవల విడుదలై ఫ్లాపైన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే -జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో రోహిత్ శెట్టి సర్కస్ లో రణవీర్ నటిస్తున్నాడు. ఆలియా భట్ తో కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో... శంకర్ తో అన్నియన్ రీమేక్ లు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.