Begin typing your search above and press return to search.
ఆ న్యూడ్ ఫోటో నాది కాదు.. ఎవరో మార్ఫింగ్ చేశారు..!
By: Tupaki Desk | 15 Sep 2022 10:19 AM GMTబాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఇటీవల నగ్నంగా ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఒంటిపై నూలుపోగు లేకుండా ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ పిక్స్ అసలు తనవి కాదని ఇప్పుడు రణవీర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రణవీర్ సింగ్ న్యూడ్ గా ఫొటోలకు పోజులివ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసభ్యకరమైన రీతిలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఆ ఫొటోలు ఉన్నాయంటూ ట్రోల్ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా పెట్టారు.
ముంబయిలోని ఓ ఎన్జీవోకి చెందిన ఓ సామాజికవేత్త, మహిళా న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద జులై 26న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు రణవీర్ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. గత నెలలో రణ్ వీర్ పోలీసుల ముందు తన స్టేట్మెంట్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఆగస్టు 29న పోలీసులు రణవీర్ ని రెండు గంటల పాటు ప్రశ్నించి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినట్లుగా బయటకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా పోలీసులు అతని ఫోటోలు చూపించగా.. అందులో ఒకటి తనది కాదని రణవీర్ చెప్పారట. న్యూడ్ ఫొటోషూట్ లో భాగంగా షేర్ చేసిన ఫొటోగ్రాఫ్స్ లో ఒక ఫొటోను మార్ఫింగ్ చేశారని పేర్కొన్నాడట.
అందులో ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తున్నాయని.. కానీ తను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోల్లో ఈ మార్ఫింగ్ ఫొటో లేదని పోలీసులతో రణవీర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ఫొటో కారణంగానే తనపై కేసు పెట్టారని.. కానీ అది తన ఫొటో కాదని బాలీవుడ్ హీరో తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
రణవీర్ సింగ్ చెప్పినట్లుగా అది మార్ఫింగ్ ఫొటోనా? కాదా? అనేది నిర్ధారించుకోవడానికి పోలీసులు ఫోరెన్సిక్ టీమ్ సహాయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫొటోని మార్ఫింగ్ చేసినట్లుగా తేలితే ఈ కేసులో రణవీర్ కి క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, 70వ దశకంలో న్యూడ్ ఫోటో షూట్ చేసిన పాప్ ఐకాన్ బర్ట్ రేనేల్డ్స్ నివాళిగా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం రణ్ వీర్ సింగ్ ఇలా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.గతంలో 'బేఫికరే' సినిమా కోసం రణవీర్ న్యూడ్ గా నటించి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ తర్వాత పలువురు హీరోలు ఇదే ట్రెండ్ అంటూ నగ్నంగా ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.