Begin typing your search above and press return to search.
ఆవిడను ఎత్తుకెళతానన్నాడు!
By: Tupaki Desk | 14 March 2019 4:55 PM GMTదీపిక పదుకొనే- రణవీర్ జంట అచ్చటా ముచ్చట గురించి తెలిసిందే. ఈ జోడీ పెద్దలు కుదుర్చుకున్న ప్రేమ వివాహం చేసుకుని హాయిగా కొత్త గోల్స్ సెట్ చేసుకుని లైఫ్ లో ముందుకు సాగిపోతున్నారు. అయితే అతడు .. ఆమె ఆ మధ్యలో ఆవిడెవరో కానీ.. !! ఆవిడపై సింబా మనసు పారేసుకున్నాడు. ``నాతో పాటు నిన్ను కూడా మా ఇంటికి తీసుకెళ్లచ్చా`` అంటూ ఆ అందమైన అమ్మాయికి ప్రపోజల్ పెట్టాడు. అసలావిడ ఉండగా ఈవిడెవరు? దీపిక ఒప్పుకుంటుందా? అని సందేహం కలుగుతోందా? అయితే వివరాల్లోకి వెళ్లాలి.
రణవీర్ ప్రపోజ్ చేసింది ప్రాణం ఉన్న అమ్మాయికి కాదు.. ఉత్స విగ్రహంలా నిలిచి ఉన్న మైనపు విగ్రహానికి. అది కూడా తన భార్యామణి దీపిక పదుకొనే మైనపు విగ్రహానికి ఈ ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడర్థమైందా? ఆవిడా మా ఆవిడే!! అని ఫీలై ఆ అందానికి మంత్ర ముగ్ధుడైపోయి అలా ప్రపోజ్ చేశాడన్నమాట. ఆ విగ్రహం చెంత దీపిక నిలుచుని ఉండగా అసలు ఆ ఇద్దరిలో ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టలేనంతగా కనిపిస్తోంది ఆ విగ్రహం. గతంలో లండన్ మ్యాడమ్ తుస్సాడ్స్ ఎన్నో విగ్రహాల్ని ఆవిష్కరించినా ఇంతటి ప్రశంసలు అయితే దక్కలేదు. దీపిక విగ్రహం పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ విగ్రహానికి డిజైన్ చేసిన డ్రెస్ కూడా అంతే అద్భుతంగా ఉంది.
2016 ఐఫా అవార్డుల కోసం దీపికకు ఈ డ్రెస్ ని డిజైన్ చేశారు సవ్యసాచి ముఖర్జీ. దీపిక ఫేవరెట్ డ్రెస్ అది. ఆ డ్రెస్ లో ఉండగానే దీపికకు మ్యాడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు కొలతలు తీసుకున్నారు. ప్రస్తుతం లండన్ లో ప్రతిష్ఠించిన ఆ విగ్రహానికి అదే డ్రెస్ ని తొడిగారు. సందర్శకులు ఆ సౌందర్యానికి ముగ్ధులై సెల్ఫీలు దిగాలంటూ మీద పడుతున్నారట. ఇంతకీ రణవీర్ కి తన వెంట తీసుకెళ్లేందుకు తుస్సాడ్స్ వాళ్లు అనుమతిస్తారంటారా?