Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి కథను వద్దంటున్నాడు?

By:  Tupaki Desk   |   20 Dec 2017 11:06 AM GMT
అర్జున్ రెడ్డి కథను వద్దంటున్నాడు?
X
టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ సునామీని సృష్టించి అందరి హృదయాలను కదిలించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా తెరకెక్కించడంతో సినిమాను దర్శక దిగ్గజాలు కూడా చాలా ఇష్టపడ్డారు. అంతే కాకుండా పరభాషా సినీ ప్రముఖులు కూడా సినిమాపై మనసు పారేసుకుని వారి ప్రేక్షకులకు చూపించాలని రీమేక్ హక్కులను కొనేసుకున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా 3 భాషల్లో తెరకెక్కడానికి సిద్ధమైంది. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో ఈ సినిమాను రన్వీర్ సింగ్ చేయడానికి సిద్దమయ్యాడు అని అందరికి తెలిసిన విషయమే. స్పెషల్ షో వేయించుకొని మరి ఒకసారి చూసి చేయాలనీ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాకుండా సినిమాను సందీప్ వంగా తెరకెక్కించాలని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ అ హీరో మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి పాత్రలు ఈ టైమ్ లో చేయడం కరెక్ట్ కాదని వేరే కథలనూ ట్రై చేస్తున్నాడట. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న సందీప్.. రన్వీర్ నిర్ణయానికి కొంచెం నిరాశ చెందాడు.

అయితే ఎలాగైనా బాలీవుడ్ లోనే తెరకెక్కించాలని మరో హీరో షాహీద్ కపూర్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అతను చివరగా ఉడ్తా పంజాబ్ సినిమాతో మంచి హిట్ అందుకుని నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో సందీప్ ఇటీవల అతనికి కథను చెప్పి మెప్పించాడట. ఫైనల్ గా అ హీరో ఒకే చెప్పడంతో నెక్స్ట్ ఇయర్ లో వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుకునుటున్నట్లు టాక్.