Begin typing your search above and press return to search.

#83 లిటిల్ మాస్ట‌ర్ గ‌వాస్కర్ లుక్

By:  Tupaki Desk   |   11 Jan 2020 2:48 PM GMT
#83 లిటిల్ మాస్ట‌ర్ గ‌వాస్కర్ లుక్
X
స్పోర్ట్స్ బ‌యోపిక్ కేటగిరీలో వ‌స్తున్న తాజా సినిమా 83. ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడు. దీపిక కీల‌క పాత్ర‌ధారి. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాజిద్ న‌డియావాలా- దీపిక ప‌దుకొనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌పిల్ దేవ్ లైఫ్ స్టోరి.. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీ నేప‌థ్యంలోని క‌థాంశ‌మిది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా 83 ప్ర‌మోష‌న్ ని ర‌ణ‌వీర్ ప‌రుగులు పెట్టిస్తున్నాడు. ఈ సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. పైగా క‌పిల్ దేవ్ పాత్ర‌లో న‌టిస్తున్నందుకు ఆయ‌న వ‌ద్ద‌నే క్రికెటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. అందుకోసం ఏకంగా క‌పిల్ దేవ్ ఇంటికి వెళ్లి ప‌ది రోజులు ఆయ‌న‌తోనే ఉన్నాడు.

ఇప్ప‌టికే క‌పిల్ దేవ్ పాత్ర‌ధారి లుక్ రిలీజై ఆక‌ట్టుకుంది. ర‌ణ‌వీర్ అచ్చం క‌పిల్ ని త‌ల‌పించే గెట‌ప్ తో ఒక‌రకంగా మ్యాజిక్ చేవాడు. `ఇట్స్ క‌మింగ్` అంటూ తాజాగా గ‌వాస్క‌ర్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. తాహిర్ రాజ్ భాసిన్ ఈ చిత్రంలో లిటిల్ మాస్ట‌ర్ గ‌వాస్క‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని ఇన్ స్టా వేదిక‌గా ర‌ణవీర్ వెల్ల‌డించారు. ఇక 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీలో క‌పిల్ తో పాటుగా కీల‌క పాత్ర‌ధారిగా గ‌వాస్కర్ పేరు రికార్డుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

దీపిక ప‌దుకొనే- ష‌కీబ్ స‌లీం-తాహిర్ రాజ్ భాసిన్-హార్డీ సంధు- అమృత పురి- విర్క్ - జీవా- సాహిల్ ఖ‌త్త‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ 83 ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. దీపిక మ‌రోవైపు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించిన చ‌పాక్ ప్ర‌చారంలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.