Begin typing your search above and press return to search.

మళ్లీ టెంపరా... టూ మచ్!!

By:  Tupaki Desk   |   9 Jun 2018 5:30 PM GMT
మళ్లీ టెంపరా... టూ మచ్!!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస ఫ్లాపుల్లో ఉండి అతడికి హిట్ అత్యవసరమైన టైంలో వచ్చిన మూవీ టెంపర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నాపేరు దయ.. నాకు లేనిదే అది అంటూ గంభీరంగా తారక్ చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాయి. ఈ కథాంశం కొత్తగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బ్రహ్మాండంగా వచ్చాయి.

టెంపర్ సబ్జెక్టు నచ్చడంతో ఈ సినిమాను బాలీవుడ్ లోనూ తెరకెక్కించాలని నిర్ణయించారు. బ్రెయిన్ లెస్ కామెడీ చిత్రాల స్పెషలిస్టు రోహిత్ శెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. పద్మావత్ లో విలన్ రోల్ చేసి విమర్శకులు ప్రశంసలు సైతం దక్కించుకున్న రణ్ వీర్ సింగ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సింబ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని హిందీతోపాటు తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయాలనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది.

టెంపర్ ఇప్పటికే తెలుగులో రిలీజై సూపర్ హిట్టయింది. అదే కథాంశంతో సినిమా తీస్తూ మళ్లీ తెలుగులోకి డబ్ చేయాలన్న ఆలోచనే టూ మచ్ గా ఉంది. అలాగని రణ్ వీర్ సింగ్ కు తెలుగులో విపరీతమైన ఇమేజ్ ఏమీ లేదు. రోహిత్ శెట్టి ఎంత ట్రీట్ మెంట్ మార్చినా అదే కథ బేసిక్ ట్రీట్ మెంట్ మార్చడం కుదరదు. అలాంటప్పుడు మళ్లీ ఆ సినిమాను డబ్ చేయడమంటే డబ్బుల కోసం అత్యాశ పడుతున్నారు అనుకోవాల్సిందే.