Begin typing your search above and press return to search.

ఖిల్జీ కష్టానికి సత్కారం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   10 April 2018 4:34 AM GMT
ఖిల్జీ కష్టానికి సత్కారం చేస్తున్నారు
X
రాజపుత్రులు గర్వంగా భావించే వీరవనిత రాణి పద్మావతి కథతో భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కు మొదటి భారీ హిట్ లభించింది. ఈ మూవీలో కళ్లు చెదిరే సెట్టింగులు.. అద్భుతమైన డ్యాన్సులు.. భన్సాలీ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది మరొకటుంది. అదే క్రూరుడైన అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్ నటన.

బాలీవుడ్ సినిమాల్లో అత్యంత క్రూరమైన విలన్ల లిస్టులో అల్లావుద్దీన్ ఖిల్లీ పాత్ర ముందు వరసలో నిలిచిపోతుందని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఈ పాత్రలో కళ్లలోనే అతడు చూపించిన క్రూరత్వం శభాష్ అనిపించేలా ఉంది. ఈ పాత్ర మరెవరు చేయలేరన్నంత గొప్పగా రణ్ వీర్ సింగ్ నటించాడు. అతడి కష్టం వృథాగా పోలేదు. ఈ పాత్ర భారతీయ సినిమా అత్యున్నతంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది రణ్ వీర్ సింగ్ ను వరించింది. ‘‘పద్మావత్ సినిమాలొ గుర్తుండిపోయే పాత్రను చేసినందుకు గాను రణ్ వీర్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేశామని’’ అవార్డు కమిటీ ప్రకటించింది.

పద్మావత్ సినిమాలో రాణి పద్మావతిగా దీపికా పదుకునే.. ఆమె భర్త రావల్ రతన్ గా షాహిద్ కపూర్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. రణ్ వీర్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇది. బోనస్ గా దాదాసాహెబ్ అవార్డునూ తెచ్చిపెట్టింది. ఈ ఏడాది పూర్తయ్యేలోగా పద్మావత్ సినిమా మరిన్ని అవార్డులు కొల్లగొట్టడం ఖాయమన్నది బాలీవుడ్ ట్రేడ్ పండిట్ల మాట.