Begin typing your search above and press return to search.
నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న ప్రముఖ హీరో!
By: Tupaki Desk | 4 Aug 2020 2:30 AM GMTసినీ ఇండస్ట్రీలో యాక్టర్లు నటిస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం కొత్తేమి కాదు. అదే బాటలో మరో స్టార్ హీరో అడుగు పెట్టబోతున్నాడు. ఆయనే రన్వీర్ సింగ్. ఇప్పటికే యాక్టింగ్ చేస్తూ నిర్మాతలుగా సక్సెస్ అయిన వారిలో స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, షారుఖ్ ఖాన్ లతో పాటు దీపిక పదుకోనె కూడా ఇటీవలే చెపాక్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారింది. కెఏ ప్రొడక్షన్స్ పేరుతో దీపిక చెపాక్ సినిమా నిర్మించింది. కానీ ఎవరు ఊహించని విధంగా రన్వీర్ సింగ్ నిర్మాతగా మారుతాడని అనుకోలేదు. ఎందుకంటే అతను ఎంతటి టాలెంటెడ్ నటుడో చెప్పక్కర్లేదు. తాజా సమాచారం ప్రకారం.. సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి దానికి 'మా కసం' అని పేరు రిజిస్టర్ చేయించాడు. మా కసం అనే పేరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి రన్వీర్ 2017 డిసెంబర్లోనే తన తల్లి అంజు భావననితో కలిసి ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయించుకున్నాడట. అంతేగాక ఇటీవలే ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో.. తను మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను నిర్మిస్తానని తెలిపాడు. గోవిందా, అనిల్ కపూర్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించే హీరోలను తన ప్రొడక్షన్లో పరిచయం చేస్తాడని అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా గల్లీబాయ్ సినిమా విజయం తర్వాత ఇండిపెండెన్ట్ కళాకారుల కోసం నవజార్ ఏరానీ అనే లేబిల్ కూడా ప్రారంభించాడు. అయితే నటుడుగా సక్సెస్ అయిన రన్వీర్ ప్రొడ్యూసర్ అవుతాడని ముందే తెలుసంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రన్వీర్ ప్రస్తుతం స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ '83' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా నిర్మాతలలో ఒకరు అతని భార్య దీపిక కావడం విశేషం. మరి రన్వీర్ నుండి ఎప్పుడు సినిమా రానుందో చూడాలి!