Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ చప్పల్స్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్
By: Tupaki Desk | 22 July 2022 8:31 AM GMTరౌడీ విజయ్ దేవరకొండ- రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ తో కరణ్ జోహార్ భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తారా? అంటే.. అవుననే సంకేతాలు అందాయి. కరణ్ 'ఎస్- నేనే దర్శకుడిని'' అని అనడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది సెట్స్ కెళ్లేందుకు చాలా సమయం పడుతుందనేది ఓ విశ్లేషణ.
టాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఎదిగేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో పాన్ ఇండియా హీరోగా పాపులరైపోతున్నాడు. లైగర్ జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు ఇప్పటికే హిందీ బెల్ట్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇంతకుముందు విడుదలైన లైగర్ ట్రైలర్ తెలుగు- హిందీ ఆడియెన్ లో బోలెడంత క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ కి ఇది బాగా కనెక్టయిపోయిందంటూ ప్రచారం సాగిపోతోంది. అంతగా నిర్మాత కరణ్ జోహార్ అద్భుత ప్లానింగ్ తో ఈ మూవీకి హైప్ తెస్తున్నాడు.
లైగర్ టీమ్ ఒకే రోజు రెండు పెద్ద నగరాల్లో ప్రమోషన్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ వేడుకను డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. లైగర్ ముంబై మీడియా మీట్ లో బోలెడన్ని ఛమక్కులు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. ట్రైలర్ ఈవెంట్ కి హీరో రణవీర్ సింగ్ రాకతో మరో లెవల్ లో ఎనర్జీ వచ్చింది. కరణ్- దేవరకొండ టీమ్ కి అతడు బోలెడంత ఎనర్జీని ఇచ్చాడు. అయితే మీడియా ఇంటరాక్షన్ సమయంలో రణ్ వీర్- విజయ్ ఒకరి చొక్కాలను మరొకరు మార్చుకోవడమే కాకుండా.. వేదికపై పారవశ్యంలో కలిసి డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ .. జర్నలిస్టులు కరణ్ ను ఆ ఇద్దరినీ కలిపి మల్టీ-స్టారర్ చేయబోతున్నారా? అని ప్రశ్నించారు. ''నిజాయితీగా చెప్పాలంటే రణ్వీర్ -విజయ్ డిలను కలిపి దర్శకత్వం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే రణవీర్ కి 'ఇద్దరు హీరోల' ప్రాజెక్ట్ చేయడానికి సంకోచించడు'' అని కరణ్ అన్నారు.
కానీ ఈ మల్టీస్టారర్ ఇప్పట్లో సాధ్యమా? అంటే చెప్పలేం. రణవీర్ ప్రస్తుతం హిందీ పరిశ్రమలో బిజీగా ఉండగా.. ఇక్కడ విజయ్ దేవరకొండ అంతే బిజీగా ఉన్నాడు. దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ పూరీకి కాల్షీట్లు ఇచ్చాడు. సమంతతో కలిసి వేరొక సినిమా చేస్తున్నాడు. ఇద్దరి మల్టీస్టారర్ కి చాలా సమయం పట్టొచ్చు.
చెప్పులతో వేదికపై షాకిచ్చిన వీడీ!ఫ్యాషన్ ఎంపికల విషయంలో ఎనర్జిటిక్ రణ్ వీర్ సింగ్ ని అనుసరిస్తాడు విజయ్ దేవరకొండ. స్టైల్ కంటెంట్ లో అతడిని చాలాసార్లు ఇమ్మిటేట్ చేసి యువతరంలోకి దూసుకెళ్లాడు. అలాంటిది ఇప్పుడు రణవీర్ తో కలిసి విజయ్ దేవరకొండ ఒకే వేదికను పంచుకున్నాడు. ఈ వేదికపై చొక్కాలు ఒకరి నుంచి ఒకరు ఎక్స్ ఛేంజ్ చేసుకుని డ్యాన్సులేస్తూ కనిపించారు ఇద్దరూ. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.
విజయ్ దేవరకొండ లైగర్ ఈవెంట్ లో చప్పల్స్ ధరించడం కూడా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇలా చెప్పులు ధరించడంపై రణవీర్ సింగ్ అతన్ని ట్రోల్ చేశాడు. 'భాయ్ కా స్టైల్ దేఖో' అని వ్యాఖ్యానించాడు. ముంబై లో లైగర్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చప్పల్స్ ధరించడం గురించి రణవీర్ సింగ్ చాలా విషయాలు చెప్పాడు.
ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ హవాయి చెప్పులు ధరించి ఆశ్చర్చపరిచాడు. అయితే అక్కడ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన రణ్ వీర్ సింగ్ హిందీలో ఎగ్జయిటవుతూ మాట్లాడాడు. ''భాయ్ కా స్టైల్ దేఖో.. ఐసే లాగ్ రహా హై.. యే మేరే ట్రైలర్ లాంచ్ పే అయ్యా హై యా మెయిన్ ఇంకే ట్రైలర్ లాంచ్ పే అయ్యా హు'' అని వ్యాఖ్యానించాడు. దీనర్థం..తమ్ముడి స్టైల్ చూడండి.. అతను ఇలాగే ఉన్నాడు. నేను అతని ట్రైలర్ లాంచ్ కి వచ్చే బదులు నా ట్రైలర్ లాంచ్ కి రమ్మని పిలుస్తాను అని వ్యాఖ్యానించాడు.
విజయ్ బ్లాక్ టీషర్ట్ ధరించి లేత గోధుమరంగు కార్గో ప్యాంట్ తో కనిపించాడు.. కానీ వైట్ చప్పల్స్ తో స్టైల్ కంటెంట్ కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. అయితే రణ్ వీర్ అతన్ని జాన్ అబ్రహంతో పోల్చాడు. జాన్ కూడా ఈవెంట్ లలో చప్పల్స్ తో కనిపించాడని తెలిపాడు. మరోవైపు రణ్ వీర్ బ్లాక్ టీ - ప్రింటెడ్ బ్లాక్ ప్యాంట్ ధరించి బ్లాక్ బూట్ లతో స్టైలిష్ గా కనిపించాడు.