Begin typing your search above and press return to search.

అభిమాన సినిమాల‌తో ర‌ణ్ వీర్ సూట్..వైర‌ల్ పిక్!

By:  Tupaki Desk   |   21 Jan 2018 6:11 AM GMT
అభిమాన సినిమాల‌తో ర‌ణ్ వీర్ సూట్..వైర‌ల్ పిక్!
X
సాధార‌ణంగా త‌మకు న‌చ్చిన‌ సినిమా పోస్ట‌ర్ల‌ను కొంద‌రు బెడ్రూం గోడ‌ల‌పై నింపేసి సంతోషిస్తుంటారు. మ‌రి కొంద‌రు త‌మ అభిమాన హీరోలు వేసుకున్న డ్రెస్ ల‌ను....వారి స్టైల్ ను అనుక‌రించ‌డానికి చూస్తుంటారు. అయితే, త‌న‌కు న‌చ్చిన సినిమాల‌న్నిటినీ ఓ సూట్ పై ప్రింట్ చేయించి త‌న అభిమానాన్ని చాటుకున్నాడో వీరాభిమాని. ఏదో స‌ర‌దాగా సూట్ కుట్టించుకొని ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పెట్టేసి ఊరుకోలేదు. ఏకంగా ఓ ఫంక్ష‌న్ కు జంకుబెంకు లేకుండా ఆ సూట్ ను వేసుకొని మీడియాకు ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆ సినిమా పిచ్చోడు మ‌రెవ‌రో కాదు....బాజీరావ్ పాత్ర‌లో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన ర‌ణ్ వీర్ సింగ్. నిన్న రాత్రి జ‌రిగిన 63 వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో రణ్ వీర్ ధ‌రించిన ఆ సూట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఆ సూట్ వేసుకున్న ర‌ణ్ వీర్ ఫొటో....సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ ది స్క్రీన్ కూడా ర‌ణ్ వీర్....డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వంటి విష‌యాల్లో త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటాడు. అయితే, నిన్న రాత్రి జ‌రిగిన ఆ వేడుక‌లో ర‌ణ్ వీర్ త‌న విలక్ష‌ణ‌త‌ను పీక్స్ కు తీసుకెళ్లాడు. 1980 నుంచి 1990 మ‌ధ్య‌లో విడుద‌లైన త‌న ఫేవ‌రెట్ బాలీవుడ్ సినిమాల‌న్నింటినీ...ఓ సూట్ పై ప్రింట్ చేయించాడు ర‌ణ్ వీర్. త‌న చిన్నత‌నం నుంచి ర‌ణ్ వీర్ కు సినిమాలంటే పిచ్చ‌ని, తాను హీరో అయ్యేందుకు స్ఫూర్తినిచ్చిన హీరోలంద‌రి గౌర‌వార్థం ఈ సూట్ ధ‌రించాడ‌ని అత‌డి స్టైలిస్ట్ తెలిపాడు. ఈ డ్రెస్ లో త‌మ అభిమాన హీరో ర‌ణ్ వీర్ ను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. సినిమాలంటే అమితంగా ఇష్ట‌ప‌డేవారు సినిమాల‌ను తిని, తాగుతుంటార‌ని...కానీ, త‌మ హీరో ఏకంగా సినిమాల‌ను నిజంగా ధ‌రించాడ‌ని తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి రణ్ వీర్ వెరైటీ సూట్ ఫొటో.... సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ర‌ణ్ వీర్ సింగ్ ...అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో న‌టించిన వివాదాస్ప‌ద చిత్రం `ప‌ద్మావ‌త్` ఈ నెల 26న విడుద‌ల కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రణ్ వీర్ లుక్, ట్రైల‌ర్ లో ర‌ణ్ వీర్ ప‌ర్ ఫార్మ‌న్స్ ...సినిమాలో ర‌ణ్ వీర్ పాత్ర‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచాయ‌ని చెప్ప‌వ‌చ్చు.