Begin typing your search above and press return to search.

మ‌న గోవిందాలు పూల‌రంగ‌డి ఫాలోవ‌ర్స్!

By:  Tupaki Desk   |   26 Sep 2018 7:55 AM GMT
మ‌న గోవిందాలు పూల‌రంగ‌డి ఫాలోవ‌ర్స్!
X
ప‌బ్లిసిటీలో ర‌ణ‌వీర్ ప‌బ్లిసిటీ వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర‌వేమ‌. వింత వింత డ్రెస్సులు.. పూల చొక్కాలు.. పొట్టి నిక్క‌ర్ల‌తో వీధుల్లో తిరిగేస్తూ బోలెడంత ప్ర‌చారం కొట్టేస్తాడు.. ముంబై వీధుల్లో పెహ‌న్‌ షాలా తిరిగేస్తూ అత‌డు చేసే ర‌చ్చ మామూలుగా ఉండదు. ప్ర‌చార‌ కార్య‌క్ర‌మాల్లో వైబ్రేంట్ యాటిట్యూడ్‌ తో ఆక‌ట్టుకుంటాడు అత‌డు. ఏ ఇత‌ర హీరోతో పోల్చినా ర‌ణ‌వీర్ సింగ్ చాలా డిఫ‌రెంట్‌.. వెరీ స్పెష‌ల్‌.

అయితే స‌రిగ్గా ఇదే స్టైల్ మ‌న టాలీవుడ్ స్టార్ల‌ను ఆక‌ర్షిస్తోందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లి కాలంలో ర‌ణ‌వీర్‌ ని టాలీవుడ్‌ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ - నాని - సుధీర్‌ బాబు వంటి స్టార్లు ఫాలో అవ్వ‌డం చూస్తున్నాం. ఇదివ‌ర‌కూ `గీత‌గోవిందం` ప్ర‌చార‌ వేదిక‌పై దేవ‌ర‌కొండ పంచెక‌ట్టు తో ప్ర‌త్య‌క్ష‌మై షాకిచ్చాడు. అంత‌కుముందు ప‌లు అవార్డు వేడుక‌ల్లో దేవ‌ర‌కొండ వెరైటీ డ్రెస్ సెన్స్‌ తో మైమ‌రిపించాడు. ఆ వెన‌క బోలెడంత స్కెచ్ ఉందన‌డంలో సందేహం లేదు. అది పెద్ద రేంజులోనే అభిమానుల్లో వ‌ర్క‌వుటైంది కూడా. దేవ‌ర‌కొండ‌ విభిన్న‌మైన వేష‌ధార‌ణ వెన‌క ర‌ణ‌వీర్ స్ఫూర్తి క‌నిపించింది. యువ‌హీరోలు ప‌రిశ్ర‌మ‌లో రాణించాలంటే.. ఇన్నోవేష‌న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్‌ లో దేవ‌ర‌కొండ - నాని లాంటి హీరోలు చేసే ప‌ని చాలా తెలివైనదేన‌న‌డంలో సందేహం లేదు. ఇక‌పోతే మ‌న అగ్ర‌ హీరోలెవ‌రూ ప్ర‌చారం కోసం వేషం ప‌రంగా ప్ర‌యోగాలు చేయ‌లేదు. పంచె క‌ట్టి.. లేదా చెరిగిన జుత్తుతో కామ‌న్‌ మేన్‌ లా క‌నిపించ‌డం అన్న‌ది లేనేలేదు.

యువ‌హీరోలు మాత్రం అందుకు విరుద్ధంగానే వెళుతున్నారు. మొన్న‌టికి మొన్న దేవ‌ర‌కొండ లానే హీరో సుధీర్‌ బాబు `న‌న్ను దోచుకుందువ‌టే` ప్ర‌మోష‌న్స్ కోసం విచిత్ర వేష‌ధార‌ణ‌తో ప్ర‌త్య‌క్ష‌మై షాకిచ్చాడు. లూజు చొక్కాయ్.. క్యాజువ‌ల్ ఫ్యాంటు - త‌ల‌కు విగ్గుతో ప్ర‌త్య‌క్ష‌మై ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇదంతా ప్ర‌చార‌పు ఎత్తుగ‌డేన‌ని అర్థ‌మైంది. మునుముందు టాలీవుడ్‌ లోనూ మ‌న యువ‌హీరోలు ప‌బ్లిసిటీ స్టంట్‌ లో ట్రెండ్‌ ని పూర్తిగా మారుస్తున్నారు. అన్న‌ట్టు ఈ ట్రెండ్‌ కి ఆద్యుడు ఎవ‌రు? అంటే బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌. అత‌డిని ర‌ణ‌వీర్ ఫాలో చేస్తున్నాడు. ర‌ణ‌వీర్‌ ని మ‌న‌వాళ్లు ఫాలో అవుతున్నారు. మొన్న‌టికి మొన్న ర‌ణ‌వీర్ పూల‌చొక్కాయ్.. వెరైటీ ఫ్యాంటుతో ముంబైలోని ఓ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొని పెద్ద షాకిచ్చాడు. అత‌డి గెట‌ప్ పూల‌రంగ‌డినే త‌ల‌పించింది. టాలీవుడ్ యువ‌హీరోలు.. ఇలాంటి ఎన‌ర్జిటిక్ స్టార్‌ ని ఫాలో అవ్వ‌డం అన్న‌ది నైస్ గేమ్ ప్లాన్ అనే చెప్పాలి. అందుకే ర‌ణ‌వీర్ సింగ్‌ కి ఫోర్బ్స్ ఇండియా ప్ర‌త్యేకించి `యూత్ ఐక‌న్‌` అవార్డును ఇచ్చి స‌ర్‌ ప్రైజ్ చేసింది. ర‌ణ‌వీర్ బాలీవుడ్‌ లోనే ఖాన్‌ ల త‌ర్వాత అంత‌టి ధ‌న‌వంతుడిగా ఎదిగేస్తున్నాడ‌న‌డానికి ఇదే సింబాలిక్‌.