Begin typing your search above and press return to search.

రణవీర సింగూ నీకు దండాలయ్యా సామీ

By:  Tupaki Desk   |   11 Dec 2016 1:30 AM GMT
రణవీర సింగూ నీకు దండాలయ్యా సామీ
X
''బేఫికర్'' రిలీజ్ తరువాత అసలు హీరో రణవీర్ సింగ్ విన్యాసాలను వెండితెర మీద చూసినోళ్ళందరూ దాదాపు షాక్ కు గురైనవారే. ఎందుకంటే మనోడు ఆ రేంజులో తోలుతీసి ఆరేశాడు. కొంతమంది అతి అంటున్నారు.. కొంతమంది మరీ టూ మచ్ అంటున్నారు కాని.. ఆ రేంజు పెర్ఫామెన్స్ చూసి ఎవరైనా షాక్ తినాల్సిందే. కేర్ ఫ్రీ గయ్ తరహా పాత్ర చేసిన రణవీర్.. సింపుల్ గా చితక్కొట్టేశాడు.

ఏకంగా బ్యాక్ నుండి న్యూడ్ బాడీ కూడా చూపించేశాడు ఈ కుర్ర హీరో. ఎంత సిక్స్ ప్యాక్ ఉంటే మాత్రం.. అండర్ వేర్ లో దర్శనమిస్తారా మనోళ్ళు? రణవీర్ సింగ్ మాత్రం ఏకంగా ఓపెనింగ్ సీన్లోనే ఆ రేంజులో దర్శనమిచ్చి.. ఫుల్ బాడీ చూపిస్తూ ఫుల్ లెంగ్త్ సీన్ చేసేశాడు. ఏదో అమ్మాయిలేని ఎక్సపోజింగ్ చేసేది.. అబ్బాయిలు కూడా చేయొచ్చు అంటూ కంకణం కట్టుకుని మరీ తన సిక్స్ ప్యాక్ కండలను ఆరబోశాడు ఈ అతేంద్రసామి. కాకపోతే మనోడ్ని ఎందుకు మెచ్చుకోవాలంటే.. అసలు ప్యారిస్ వెళ్ళిన ఒక డిల్లీ కుర్రాడు ఎలా బిహేవ్ చేస్తాడో.. సేమ్ అలాగే పిచ్చెత్తించాడు. పైగా అక్కడ అమ్మాయిలను చూసి టెంప్ట్ అయిపోవడం.. తీరా వారు లెస్బియన్లు అని తెలిసి షాకవ్వడం.. ఆ ఎక్సప్రెషన్లు అన్నీ ఓ రేంజులో ఉన్నాయి. మన దేశపు హీరోలు అలాంటి సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కు కల్చర్ షాక్ తగలకుండా ఉండదు.

ఏదేమైనా కూడా అలాంటి పాత్రను చాలా ఈజీగా చేసినందుకు.. రణవీర సింగూ... నీకు దండాలయ్యా సామీ!!