Begin typing your search above and press return to search.

ఇంకెన్ని యాడ్స్ లో నటిస్తావయ్యా?

By:  Tupaki Desk   |   21 Feb 2017 9:41 AM GMT
ఇంకెన్ని యాడ్స్ లో నటిస్తావయ్యా?
X
పాపులారిటీ వస్తే ప్రకటనలు అవే వస్తాయంటారు.. అంతేకాదు.. ప్రకటనల్లో నిత్యం కనిపిస్తే పాపులారిటీ కూడా అలాగే మెంటైన్ అవుతుందన్నది కొత్త ట్రెండు. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ఈ టెక్నిక్ కనిపెట్టేసినట్టున్నాడు.. అందుకే సినిమాల కంటే ప్రకటనల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. సినిమాలు తక్కువగానే ఉన్నా ప్రకటనల్లో మాత్రం తెగ కనిపిస్తున్నాడు. ఒకప్పుడు తెలుగు హీరో మహేశ్ బాబు విషయంలోనూ ఇలాంటి అనుభవాలే ఉండడంతో రణవీర్ కు అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు. మహేశ్ ఖలేజా సినిమా సమయంలో ఆయనకు చాలాకాలం సినిమాలు లేవు. ఆ సమయంలో మహేశ్ చాలా బ్రాండ్లకు ఆయన ప్రకటనల్లో కనిపించడంతో జనం కళ్ల ముందే ఉన్నట్లుండేది. దీంతో ఫేడవుట్ కాకుండా అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు రణవీర్ దీ అదే పరిస్థితి.

థమ్స్ అప్ కు సౌత్ లో మహేశ్ - నార్త్ లో సల్మాన్ అడ్వర్టయిజ్ చేసేవారు.. ఇప్పుడా కాంట్రాక్టు రణవీర్ చేతికొచ్చేసింది. అది కూడా హోల్ ఇండియా కాంట్రాక్టు. అదొక్కటే కాదు అల్లు అర్జున్ చేతిలో ఉన్న కోల్గేట్ యాడ్ కూడా రణవీర్ పరం అయింది. రణబీర్ కపూర్ రూపా బనియన్ల యాడ్ కూడా రణవీర్ సింగ్ ఖాతాలో పడిపోయింది.

ఇవే కాకుండా రాయల్ స్టాగ్ - చింగ్స్ - మేక్ మై ట్రిప్ - హెడ్ అండ్ షోల్డర్స్ - వివో ఫోన్లు - సెట్ వెట్ క్రీమ్ - డ్యూరెక్సు కండోమ్ లు - మింత్ర - మారుతి - జాక్ అండ్ జోన్స్.. ఇలా ఆయన అడ్వర్టయిజ్ మెంట్ల ఖాతాలో ఇంకా చాలా లిస్టే ఉంది. దీంతో అటు బాలీవుడ్ - ఇటు టాలీవుడ్ లోనూ ఈ బాజీరావు మస్తానీని చూసి అంతా కుళ్లుకుంటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/