Begin typing your search above and press return to search.

అసలు అవేం డ్రస్సులు రాజా??

By:  Tupaki Desk   |   21 Feb 2017 12:47 PM GMT
అసలు అవేం డ్రస్సులు రాజా??
X
బాలీవుడ్ లో ప్రస్తుతం రణవీర్ సింగ్ ఒక హాట్ టాపిక్. మనోడు సింపుల్ హీరో నుండి ఎనర్జటిక్ హీరోగా ప్రూవ్ చేసుకుని.. ఆ తరువాత ఏకంగా టాప్ స్టార్ అయిపోయాడు. అయితే ఈ సమయంలో దీపికా పదుకొనెతో మనోడు గత కొన్నేళ్ళుగా నడిపిస్తున్న ప్రేమ యవ్వారం కూడా మాంచి రంజుగా ఉందిలే. ఎక్కడపడితే అక్కడ వీరిరువురూ కలసి కనిపిస్తూ నానా హంగామా చేయడం మనం చూడొచ్చు.

మొన్న షాహిద్ కపూర్ బర్త్ డే సందర్బంగా అతగాడి భార్య మీరా రాజ్పుత్ ఒక పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చాలామంది సినిమా నటీనటులను పిలిచింది. ఆలియా భట్.. వరుణ్‌ దావన్.. ఇలా యంగ్ గ్యాంగ్ అంతా అక్కడే వాలిపోయింది. ఆ పార్టీకి దీపిక చాలా సింపుల్ వెస్టర్న్ లుక్ లో విచ్చేస్తే.. మన రణవీర్ మాత్రం ఏదో హాలోవీన్ పార్టీకి వచ్చినట్లు లూజుగా ఉన్న ఒక స్పైడర్ మ్యాన్ డ్రస్ తరహాలో ఉండే బాడీ సూట్ వేసుకొచ్చాడు. అసలు పార్టీ ఏంటి..ఆ డ్రస్ ఏంటి.. ఈ హడావుడి ఏంటి.. నువ్వు బట్టలతోనే చంపేయగలవ్ తెలుసా.. అంటూ మనోడ్ని చూసినోళ్లందరూ ఒకటే కామెంట్లంటే చూస్కోండి.

ఇకపోతే ప్రస్తుతం దీపికతో కలసి మనోడు ''పద్మావతి'' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మనోడు విలన్ అయితే.. షాహిద్ కపూర్ హీరో. అందుకే అసలు షాహిద్ బర్త్ డే పార్టీకి వీరిద్దరూ విచ్చేశారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/