Begin typing your search above and press return to search.
అప్పుడే పెళ్లాం కొంగు చాటున!
By: Tupaki Desk | 21 Nov 2018 5:10 PM GMTబ్యాచిలర్ షిప్ వదిలి పెళ్లి బంధంతో ఒకటయ్యాక అసలు కథ మొదలవుతుంది. కొత్త జంటగా కాపురంలో రోమాంచితమైన లైఫ్ రక్తి కట్టిస్తున్నా.. క్రమక్రమంగా ఏ పురుషపుంగవుడైనా స్త్రీవశం అవ్వాల్సిందే. ఇదిగో ఇక్కడ కూడా అదే సన్నివేశం కనిపిస్తోంది. ఇలా పెళ్లయిందో లేదో అలా పెళ్లాం కొంగు చాటు మొగుడు అయిపోయాడు రణవీర్.
ప్రస్తుతం ఈ అరుదైన ఫోటో యంగ్ గయ్స్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. బెంగళూరులో అత్తారింటి వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో దీపిక- రణవీర్ జంట బోలెడంత సందడి చేసింది. ఇక రణవీర్ యథావిధిగానే తనదైన శైలిలో బోలెడంత వినోదం పంచాడు. బంగారు వర్ణం జరీ చీరలో తళతళా మెరుస్తున్న దీపిక కొంగును ఇదిగో ఇలా పట్టుకుని కనిపించాడు రణవీరుడు.
మొత్తానికి రిసెప్షన్ దశలోనే కొంగుచాటు మొగుడు అనిపించుకున్నాడు. మునుముందు దీపిక వెంట ఇలానే పడతాడా కొత్త పెళ్లి కొడుకు అంటూ సోషల్ మీడియాలో ఒకటే కామెంట్లు పడుతున్నాయి. తదుపరి ముంబైలోనూ భారీ రిసెప్షన్ కి ప్లాన్ లో ఉందీ జంట. ఇటలీ లేక్ కోమోలో ఈనెల 14 - 15 తేదీల్లో ఈ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రిసెప్షన్ ఫోటోలు వైరల్ గా మారాయి.