Begin typing your search above and press return to search.
దీపిక బాయ్ ఫ్రెండ్ ఒప్పేసుకున్నాడండీ
By: Tupaki Desk | 31 Dec 2015 9:31 AM GMTఎంత కలిసి ఫారిన్ టూర్లు వేసినా.. పబ్లిక్ ఫంక్షన్లలో ముద్దులాడేసుకున్నా.. స్క్రీన్ మీద అదిరిపోయే కెమిస్ట్రీ చూపించినా.. ప్రేమలో ఉన్నట్లు మాత్రం ఒప్పుకోరు సినీ తారలు. ఐతే బాలీవుడ్ రైజింగ్ స్టార్ రణ్ వీర్ సింగ్ మాత్రం తాను ప్రేమలో పడ్డట్లు అంగీకరించాడు. తనది అల్లా టప్పా ప్రేమ కూడా కాదని చెప్పాడు. ‘‘అవును. నేను ప్రేమలో పడ్డాను. ఒకరితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. మా రిలేషన్ చాలా బాగుంది. ఇలాంటి అనుభూతి గతంలో ఎప్పుడూ అనుభవించలేదు’’ అంటూ తన లవ్ స్టోరీ గురించి ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు రణ్ వీర్. ఐతే ఆ అమ్మాయి ఎవరంటే మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు.
కానీ రణ్ వీర్ ప్రేయసి దీపికా పదుకొనేనే అని కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఇంతకుముందు రణబీర్ కపూర్, సిద్దార్థ్ మాల్యాలతో లవ్ స్టోరీలు నడిపింది దీపిక. కానీ ఆ లవ్ స్టోరీల్ని పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపించలేదు. కానీ రణ్ వీర్ సింగ్ తో ప్రేమాయణం విషయంలో మాత్రం ఆమె సీరియస్ గానే ఉన్నట్లుంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకునే అవకాశాలున్నట్లు బాలీవుడ్ జనాలు అంటున్నారు. ఐతే ఇద్దరూ కూడా కెరీర్ లో పీక్స్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పెళ్లి ఆలోచన చేయకపోవచ్చు. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత కూడా ఇలాగే గాఢమైన ప్రేమలో ఉంటే అప్పుడు పెళ్లి వైపు అడుగులేస్తారేమో.