Begin typing your search above and press return to search.

వాటే లవ్వు గురూ.. హగ్గులే హగ్గులు

By:  Tupaki Desk   |   9 Dec 2015 7:30 PM GMT
వాటే లవ్వు గురూ.. హగ్గులే హగ్గులు
X
ర‌ణ‌వీర్ సింగ్ - దీపిక ప‌దుకొనె ప్రేమాయ‌ణం గురించి ఇటీవ‌లి కాలంలో ర‌క‌ర‌కాల పుకార్లు శికారు చేసిన సంగ‌తి తెలిసిందే. రామ్ లీల టైమ్ నుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం మొద‌లైంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే డిప్స్ అంటే విప‌రీత‌మైన ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూనే ఉన్నాడు ర‌ణ‌వీర్ త‌న చ‌ర్య‌ల‌తో. ఇటీవ‌లే ఓ ఇన్సిడెంట్ ఆ సంగ‌తిని మ‌రోసారి ప్రూవ్ చేసింది.

ముంబైలో సీరియ‌స్‌ గా ఓ అవార్డు వేడుక జ‌రుగుతోంది. అక్క‌డి నుంచి ఓ అందాల మ‌గువ హ‌ఠాత్తుగా మాయ‌మైంది. ఇంకా చెప్పాలంటే స్కిప్ కొట్టింది. ఆ మ‌గువ దీపిక ప‌దుకొనె. అవార్డు అందుకోవాల్సిన ముద్దుగుమ్మ ఏమైంది? అంటూ ఎనౌన్స్ మెంట్‌. ఇంత‌లోనే కొంటె పిల్లాడు ర‌ణ‌వీర్ వ‌చ్చి ఆ అవార్డు అందుకున్నాడు. నేను డిప్స్‌ కి అంద‌జేస్తా అంటూ!! ఆ టైమ్‌ లో అదే వేదిక‌పై ఉన్న చిలిపి పిల్ల ఆలియాభ‌ట్ ఓ మాట అంది. ఆ అవార్డేదో నేనే దీపిక‌కు ఇచ్చేదాన్ని క‌దా! నువ్వే ఎందుకు వ‌చ్చావ్‌? అంటూ ఆట‌ప‌ట్టించింది. ఆ క్ష‌ణం ర‌ణ‌వీర్ మోములో బోలెడ‌న్ని రంగులు మారాయి. అవును క‌దా! అని త‌న‌ని తాను ప్ర‌శ్నించుకున్నాడు. ఏదేమైనా ఆ ఎపిసోడ్ అలా ముగిసింది.

ఇక అస‌లు విష‌యం అహూతుల‌కు అర్థ‌మైంది. ర‌ణ‌వీర్ - దీపిక ప్రేమ‌కు సింబాలిక్ అది. క‌ట్ చేస్తే అదే రోజు రాత్రి పార్టీలో క‌లుసుకున్న ర‌ణ‌వీర్ ఆ అవార్డు ప‌త్రాన్ని దీపిక‌కి అందించాడు. ప్ర‌తిగా అత‌డిని ఏం ద‌క్కిందో తెలుసా? ఎస్‌.. నువ్వు నా వాడివి. నువ్వు లేని నా జీవితం వృథా.. అంటూ పెద్ద హ‌గ్గిచ్చింది డిప్స్‌. వాటే ల‌వ్వు గురూ? నిజ‌మైన ప్రేమ అంటే అదే మ‌రి.