Begin typing your search above and press return to search.

లవర్ సినిమా సక్సెస్ మీట్ లో ముద్దులాట

By:  Tupaki Desk   |   2 Dec 2015 1:30 PM GMT
లవర్ సినిమా సక్సెస్ మీట్ లో ముద్దులాట
X
ఎంతైనా బాలీవుడ్ జనాలు బాలీవుడ్ జనాలే. వాళ్లంత అడ్వాన్స్‌ గా ఉండటం మనోళ్ల వల్ల కాదంటే కాదు. ఒక హీరో.. తన లవర్, ఆమె మాజీ లవర్ కలిసి నటించిన సినిమాను ప్రమోట్ చేయడం, ఆ సినిమా సక్సెస్ మీట్ కు రావడం మన దగ్గర చూడగలమా? అంతే కాదు.. ఆ మాజీ లవర్ ముందే వీళ్లిద్దరూ ముద్దులాడడుకోవడం ఇంకెక్కడైనా సాధ్యమా? ఈ ‘తమాషా’కు సంబంధించిన విశేషాలేంటో చూద్దాం పదండి.

రణబీర్ కపూర్ - దీపికా పదుకొనే ఒకప్పుడు గాఢమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. రణబీర్ కత్రినాతో సెటిలైతే, దీపిక.. రణ్ వీర్ సింగ్ ను చూసుకుంది. మామూలుగా బ్రేకప్ అయిన లవర్స్ మళ్లీ కలవడం జరగదు. కానీ దీపిక - రణబీర్ అలాంటి భేషజాలకు పోలేదు. ఇద్దరూ కలిసి ‘తమాషా’ సినిమాలో నటించారు. రణ్ వీర్ కు కూడా ఈ విషయంలో అభ్యంతరం లేకపోయింది.

పైగా ‘తమాషా’ సినిమాను అతను ప్రమోట్ చేశాడు కూడా. తాజాగా ఆ సినిమా సక్సెస్ మీట్ లో కూడా పాల్గొన్నాడు రణ్ వీర్. అక్కడ రణ్ వీర్ - దీపిక కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మీడియా వాళ్ల మందు ‘నిన్ను చూసి గర్విస్తున్నా’ అంటూ ఆమె కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం.. సక్సెస్ మీట్ అయ్యాక వెళ్లబోతూ దీపికకు దగ్గరగా తన బుగ్గను పెట్టడం.. ఆమె ఇతడికి ముద్దు ఇవ్వడం.. అబ్బో మామూలు హంగామా కాదులెండి. తమాషా సక్సెస్ మీట్ లో ఆ సినిమా గురించి మాట్లాడ్డం మర్చిపోయి.. అందరికీ వీళ్ల ‘తమాషా’నే హాట్ టాపిక్ అయిపోయింది.