Begin typing your search above and press return to search.

రావుగారబ్బాయి ఆయన్ను సాగనంపేసినట్లే

By:  Tupaki Desk   |   3 Jun 2016 10:30 PM GMT
రావుగారబ్బాయి ఆయన్ను సాగనంపేసినట్లే
X
తెలుగు యాసలో కామెడీ విలనీ చేయాలంటే.. సాయాజీ షిండే కావాలి. ఇంకొంచెం పాజిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలంటే.. తమిళం నుండి ప్రభు వంటి మాజీ హీరోలు రావాలి. అబ్బే.. ఎట్టాంటి పాత్రయినా మడతెట్టెయ్యాలంటే మాత్రం.. అదిగో ఆల్‌-ఇన్‌-వన్ ప్రకాష్‌ రాజ్‌ దిగాల్సిందే. తెలుగు సినిమాల పరిస్థితి అలా ఉంది. స్పెషల్‌ పాత్రలకు శ్రీహరి వంటి వారికంటే కూడా ప్రకాష్‌ రాజ్‌ కు ఉన్న డిమాండ్‌ మామూలుగా ఉండేది కాదు. సడన్‌ ఇప్పుడు ఆయన గ్రాఫ్‌ పడిపోయింది. దానికి కారణం.. ఒక్కడే ఒక్కడు.

బ్రహ్మోత్సవం సినిమాలో ఎప్పుడూ సీరియస్‌ గా బామ్మర్ది పాత్రలోనైనా.. అ..ఆ సినిమాలో కామెడీ చేసే విలన్‌ పాత్రలోనైనా.. దివంగత రావు గోపాల్‌ రావు గారి అబ్బాయి రావు రమేష్‌ ఒదిగిపోయాడు చూడండి.. వావ్‌ అన్నారు అందరూ. సినిమాలను ఎలా క్రిటిసైజ్ చేసినా కూడా.. ఆయన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకపోగా.. అబ్బురపరిచాడు అంటూ పొగిడేస్తున్నారు. ఒకప్పుడు ఈ పాత్రకు ప్రకాష్‌ రాజ్‌ అయితే బెటర్‌ అనుకునే దర్శకులందరూ.. ఇప్పుడు రావు రమేష్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. చూస్తుంటే మనోడు శాశ్వతంగా ప్రకాష్‌ రాజ్ ను సాగనంపేసేట్టు ఉన్నాడు.

2008లో గమ్యం సినిమాలోని నక్సలైట్‌ పాత్రతో మలుపు తిరిగిన రావు రమేష్‌ కెరియర్‌.. అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిగెడుతోంది. పాపులార్టీతో పాటు అవకాశాలు పెరుగుతుంటే.. అవకాశాలొస్తున్న కొద్దీ రెమ్యనరేషన్ కూడా పెంచుతున్నాడట రావు. అయినాసరే ఆయనే కావాలి అంటున్నారు టాలీవుడ్‌ పెద్దలు.