Begin typing your search above and press return to search.
వైఎస్ `ఆత్మ`గా రావు రమేష్?
By: Tupaki Desk | 10 May 2018 4:50 PM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర్ రెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో `యాత్ర` బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండడంతో `యాత్ర`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ప్రతిష్టాత్మక బయోపిక్ లో కీలకమైన పాత్రల కోసం నటీనటులను ఎంచుకునే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. వైఎస్ ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య నటించబోతున్నట్లు పుకార్లు వెలువడిన సంగతి తెలిసిందే. వైఎస్ ముఖ్య అనుచరుడు, నమ్మిన బంటు సూరీడు పాత్రలో పోసాని నటించబోతున్నట్లు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావు పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్ నటించబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
నిజ జీవితంలో వైఎస్ రాజకీయ `యాత్ర`లో కేవీపీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. వైఎస్ కు మిత్రుడు, సన్నిహితుడు అయిన కేవీపీకి వైఎస్ ఆత్మ అని పేరుంది. వైఎస్ కు సంబంధించిన రాజకీయ వ్యవహారాలన్నీ ఆయన తరఫున కేవీపీ చక్కబెట్టేవారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం విలక్షణ నటుడు రావు రమేష్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, కేవీపీ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను చిత్రయూనిట్ సంప్రదించిందని టాక్ ఉంది. అయితే, డేట్లు సర్దుబాటుకాకపోవడంతో రావు రమేష్ కు ఆ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించబోతోందని తెలుస్తోంది. `ఆనందో బ్రహ్మ` ఫేం మహీ రాఘవ దర్శకత్వంలో `యాత్ర` తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే.