Begin typing your search above and press return to search.
రావుగారు సన్నాఫ్ సమంత
By: Tupaki Desk | 21 Dec 2018 8:13 AM GMTవరుస ప్రయోగాలతో సమంత అక్కినేని ఇండస్ట్రీని వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం రామలక్ష్మిగా, మహానటి లో జర్నలిస్టు మధురవాణి గా నటించి మెప్పించింది. ఆ తర్వాత `యూటర్న్` చిత్రం లో థ్రిల్లిచ్చే నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో భర్తతో గొడవపడే గృహిణిగా మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది.
సామ్ ప్రయోగాలు అంతటితో అయిపోలేదు. మునుముందు ఇంకా భారీ ప్రయోగాలు చేసేందుకు సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది. సామ్ తదుపరి నందిని రెడ్డి దర్శకత్వం లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇది కొరియన్ సినిమా `మిస్‌గ్రానీ`కి రీమేక్. 70 ఏళ్ల వృద్ధురాలు 20 వయసు కన్నె పిల్లగా మారిపోవాలని కలలు గంటుంది. అలా మారిపోయాక ఏం జరిగింది? అన్నదే కథాంశం. లేటు వయసు ఘాటు భామ అద్దం లో తనను తాను చూసుకుని 20 వయసుకు మారిపోవాలని కలగనడం ఓ ట్విస్టు అనుకుంటే.. తనకు 50 వయసు కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆక్తికర సన్నివేశాలు ఇందులో ఉత్కంఠ రేకెత్తిస్తాయట. ఇప్పటికే ఈ సినిమాకి కాస్టింగ్ సెలక్షన్స్ సాగుతున్నాయి.
ఇందులో సీనియర్ నటుడు రావు రమేష్ సమంతకు కొడుకు గా నటిస్తున్నారన్నది అసక్తికరమైన ట్విస్టు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. సామ్ - రావు రమేష్ పాత్రల మధ్య సంఘర్షణ అద్భుతంగా వర్కవుటవుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. `ఓ బేబి` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. త్వరలోనే అధికారికంగా ఇతర వివరాలు చెబుతారట.