Begin typing your search above and press return to search.
యాప్ బిజినెస్ లో రకుల్ కి చిక్కులేనేమో!
By: Tupaki Desk | 23 Nov 2021 8:30 AM GMTరంగుల మాయా ప్రపంచంలోకి ఎందరో వస్తుంటారు. ఎందరో వెళుతుంటారు. ఇక్కడ అందరికీ అవకాశాలు రావు. వేదికను సద్వినియోగం చేసుకుని ఎదిగేది అతి కొద్ది మంది మాత్రమే. అయితే అదే తీరుగా అందాల రకుల్ ప్రీత్ సింగ్ పరిశ్రమకు వచ్చింది. విజయం సాధించింది. అగ్ర కథానాయికగా ఎదిగేసింది. అందుకే ఇప్పుడు నవతరం ఆర్టిస్టులకు ట్యాలెంట్ కు ఏదైనా చేయాలనుకుంటోందట. నటీనటులకు సహాయం చేయడానికి ఆమె ఇప్పుడు ఒక ప్రత్యేక యాప్ ను ప్రారంభించింది.
ఈ యాప్ గురించి చెబుతూ రకుల్ ప్రాజాస్వామ్యాన్ని ప్రస్థావించడం ఆశ్చర్యపరుస్తోంది.ఇంతకీ రకుల్ ఏమంది? అంటే.. StarringYou అనేది ప్రజాస్వామిక వేదిక.. StarringYouలో ఏదైనా అవకాశం కోసం ఎక్కడి నుండైనా ఆడిషన్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఔత్సాహిక నటీనటులు- దర్శకులు- సంపాదకులు- రచయితలు- నృత్యకారులు- కొరియోగ్రాఫర్ లు .. ఇతర విభాగాల్లో పని చేయాలనుకునే నిపుణులు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఈ యాప్ సహాయం చేస్తుంది.
యాప్ గురించి సహ వ్యవస్థాపకురాలు రకుల్ మాట్లాడుతూ- ``స్టారింగ్ యుతో.. దేశంలో ఉన్న ప్రతిభావంతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులందరికీ ఒకే గమ్యస్థానంగా ఉండే సమతుల వ్యవస్థను నిర్మించాలని మేము చూస్తున్నాము. యాప్ అన్ని విభాగాలను కలిగి ఉంటుంది. సంగీతం- కాస్టింగ్- మీడియా - ప్రొడక్షన్ హౌస్ లు అన్నీ ఇందులో జాయిన్ కావచ్చు. మేము అన్ని అంశాలను అభివృద్ధి చేసేందుకు పని చేస్తాము.. అని వెల్లడించింది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ వేదికపై మోసాలు జరగకుండా చట్ట పరమైన బైలాస్ రూపకల్పన అవసరం. మోసాలు జరిగితే సొల్యూషన్ ఎలా అన్నది రకుల్ చెప్పాలి.. అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వారే మోసగిస్తున్న ఈరోజుల్లో.. ముక్కు ముఖం తెలియని వాళ్ల మధ్య వ్యవహారాలు చాలా తేడాగా ఉంటాయన్నది అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత యాప్ నిర్వాహకులకు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రచయితలకు మాత్రం సెక్యూరిటీ లేని వ్యవస్థగా ఇది ఉంది. అందుకే చాలా జాగ్రత్తలు అవసరం. అలాగే ఆర్టిస్టుల భద్రత కోసం కూడా యాప్ లో విధిగా పోలీసింగ్ ఉండాలనేది ఒక నివేదన. ప్రజాస్వామ్యంలో తేడాలు రాకుండా కాపాడటం అన్నదే ఇక్కడ కీలకం.