Begin typing your search above and press return to search.

చైతు రెండు లుక్కులు వచ్చేశాయ్

By:  Tupaki Desk   |   29 March 2017 5:59 AM GMT
చైతు రెండు లుక్కులు వచ్చేశాయ్
X
అనుకున్నట్లుగా.. ముందే చెప్పినట్లుగానే అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకు రెండు ఫస్ట్ లుక్ లు వచ్చేశాయ్. దర్శకుడి టేస్ట్ ప్రకారం ఒక లుక్.. నిర్మాత ఇష్ట ప్రకారం మరో లుక్ సందడి చేస్తున్నాయ్. ఉగాది పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు.. 'రా రండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

నాగార్జున పట్టు పట్టిన ఫస్ట్ లుక్ లో.. చైతు మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. వెనకాల ఓ అరడజన్ మంది రౌడీలను పడగొట్టేసి.. మరో రౌడీ వెనకాల పరిగెడుతున్నట్లుగా ఉన్న లుక్ చూస్తుంటే.. మాస్ హీరో అంటే ఇలా ఉండాలి కదా అనిపించక మానదు. నులక మంచాల సెటప్ అంతా చూస్తుంటే.. పల్లెటూరి నేపథ్యంలోనే సాగే చిత్రమే అనే సంగతి అర్ధమవుతుంది. మరోవైపు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇచ్చిన ఫస్ట్ లుక్ అయితే.. టైటిల్ కి తగ్గట్లుగా పండుగ మాదిరిగా ఉంది.

ఓ వైపు కుర్తాపైజమాలో చైతు కనిపిస్తుంటే.. ఇంకో పక్క హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెడలో డోలు కట్టుకుని పాట పాడుకుంటోంది. రెండు లుక్స్ వేటి జోనర్ లో అవి డిఫరెంట్ గా ఆకట్టుకోవడంతోనే.. డెసిషన్ ఫైనల్ చేసుకోలేక.. చివరకు రెండూ ఇచ్చేశారన్న మాట. ఇంతకీ ఈ రెండింటిలో ఏ లుక్ బెటర్ అనే క్వశ్చన్ వస్తే.. అది పెద్ద టఫ్ క్వశ్చన్ గానే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/