Begin typing your search above and press return to search.

బన్నీ డేటుని చైతూ పట్టేశాడు

By:  Tupaki Desk   |   11 April 2017 7:50 AM GMT
బన్నీ డేటుని చైతూ పట్టేశాడు
X
‘దువ్వాడ జగన్నాథం’ వాయిదా పడటం పక్కా అని తేలిపోయింది. ఆ వాయిదా కూడా గత కొన్ని రోజులుగా అనుకుంటున్నట్లు జూన్‌ కు కూడా కాదట. ‘డీజే’ను ఏకంగా రెండు నెలలకు పైగా వాయిదా వేశారని.. జులై ద్వితీయార్ధంలో కానీ ఈ చిత్రం విడుదల కాదని అంటున్నారు. ‘డీజే’ వాయిదా సంగతి కన్ఫమ్ అయిపోవడంతో సమ్మర్ అడ్వాంటేజీని వాడుకోవడానికి నాగచైతన్య ముందుకొచ్చేశాడు. అతను హీరోగా తెరకెక్కుతున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను ‘డీజే’ కోసం అనుకున్న మే 19వ తేదీని రిలీజ్ చేయాలని నాగార్జున ఫిక్సయినట్లు సమాచారం. ఈ చిత్రం ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చింది.

‘డీజే’ పక్కాగా అదే డేటుకి వచ్చేట్లయితే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ జూన్ తొలి వారంలో విడుదలయ్యేది. ఐతే బన్నీ సినిమా వాయిదా పడటంతో ముందుకొచ్చేస్తోంది. 19న సినిమా థియేటర్లలోకి వస్తే ఇంకో మూణ్నాలుగు వారాల పాటు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మంచి అడ్వాంటేజీ అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కూడా అందుకోవచ్చు. ఇది ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలోనే నాగ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈ చిత్రానికి. కళ్యాణ్ కృష్ణ రెండో సినిమాకు మరింత మంచి ఔట్ పుట్ ఇచ్చాడనే అంటున్నారు యూనిట్ సభ్యులు. చైతూ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/