Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: రొటీన్ గా రారండోయ్!!

By:  Tupaki Desk   |   13 May 2017 3:33 PM GMT
ట్రైలర్ టాక్: రొటీన్ గా రారండోయ్!!
X
కాస్త మొండి అమ్మాయి. చిలిపి అబ్బాయి. ప్రేమించుకోవడం. పెద్దలు కాదనడం. హీరోయిన్ తండ్రి విలనవ్వడం. హీరో పైట్ చేయడం. అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం. రారాండోయ్ ఇలాంటి 'రొటీన్' వేడకు మళ్ళీ చూద్దాం అంటున్నారు కింగ్ నాగార్జున. ఆయన తన పెద్దకొడుకుతో తాజాగా తీసిన లేటెస్ట్ సినిమా ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తోంది మరి.

కట్ చేస్తే.. పైన చెప్పిన కథంతా ట్రైలర్లో కూడా చూపించేశాడు దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా రొటీన్ ఎలిమెంట్సే ఉన్నప్పటికీ ఆ సినిమా భారీ హిట్ అయ్యింది కాబట్టి.. ఇప్పుడు అదే విధంగా ఒక సింపుల్ కథతో మరోసారి ''రారండోయ్ వేడుక చూద్దాం'' అంటూ మన ముందుకు వస్తున్నాడు. చైతన్య ఎప్పటిలాగే కూల్ గా.. రకుల్ మాత్రం కొత్తగా హోమ్లీగా.. అలాగే జగపతిబాబు అండ్ సంపత్ ఎప్పటిలాగే కాస్త కీలకమైన పాత్రల్లో.. ఇక పోసాని పృథ్వి ఎప్పటిమాదిరే కామెడీగా.. అలా కనిపించేశారు. కాకపోతే కళ్యాణ్ కృష్ణ కూర్పు కాస్త బాగానే కుదిరిందిలే. ఇక దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది.

ఇక వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను చూస్తుంటే.. ఎందుకో సడన్ గా ''నేను శైలజ'' సినిమా గుర్తొస్తోంది కదూ? అక్కడ హీరోయిన్ కు నాన్నతో ఎటాచ్ మెంట్.. ఇక్కడ హీరోకు నాన్నతో ఎటాచ్మెంట్. ఏయ్ మన లోపలున్నోడు మళ్లీ ఏసేశాడు!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/