Begin typing your search above and press return to search.

అమలాపాల్ కు అరుదైన పురస్కారం..!

By:  Tupaki Desk   |   30 Dec 2021 9:30 AM GMT
అమలాపాల్ కు అరుదైన పురస్కారం..!
X
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం గోల్డెన్ పీకాక్. అయితే ఈ గోల్డెన్ పీకాక్ అనే అవార్డును దక్షిణ భారత నటి అయినటువంటి అమలాపాల్ కు ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఇలాంటి గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన అతి తక్కువ మంది జాబితాలో అమలాపాల్ చేరింది. ఈ అత్యంత అరుదైన అవార్డు దక్కించుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నట్లు అమలాపాల్ తెలిపింది. భారతదేశంలో అతి తక్కువ మందికి ఇచ్చినటువంటి ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు సొంతం చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు అమలాపాల్ పేర్కొంది. ఈ అత్యంత అరుదైన గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటిస్తుంది. ఇప్పటికే భారత దేశంలో కొంత మందికి ఈ అవార్డు ఇచ్చింది.

అందం, అభినయంతో పాటు సీన్ ను బట్టి అందాల ఆరబోతకు కూడా వెనకాదాని నటి అమలాపాల్. తనదైన శైలిలో అమలాపాల్ నటిస్తుంది తెలుగు తమిళం మలయాళం లో నటించిన అమలాపాల్ దక్షిణాది ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమా ఇచ్చింది అంతే కాకుండా దక్షిణాది ఉండే అనేక మంది అగ్ర హీరోల సరసన కూడా అమలాపాల్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బెజవాడ, నాయక్, లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు, పిట్టకథలు ఇలాంటి తెలుగు సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల ఆమె నటించిన టువంటి ఆమె చిత్రం ఒక విలక్షణమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

అమలాపాల్ కేవలం చిత్రాలు మాత్రమే పరిమితం కాలేదు. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఆహా అనే ఓటిటి లో ప్రసారమయ్యే కుడిఎడమైతే అనే వెబ్ సిరీస్ లో అమలపాల్ నటిస్తుంది. అమలాపాల్ నటించిన టువంటి మైనా అనే చిత్రం ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి. ఫస్ట్ డబ్ల్యూ ఫిలిం మైనా కు ఆమెకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

ఇక గోల్డెన్ పీకాక్ అవార్డు విషయానికి వస్తే... ఈ అవార్డు ఇటీవల మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్ భార్య ఉపాసన కు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. అయితే ఈ అవార్డును ఇప్పటికే భారత దేశంలో చాలామంది సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మొట్టమొదట ఈ అవార్డును భారతదేశం నుంచే సొంతం చేసుకున్న వ్యక్తిగా నిలిచారు. గతంలో కూడా ఎంతో మంది మలయాళ నటులు ఈ అవార్డును అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.