Begin typing your search above and press return to search.

అచ్చు సావిత్రి ఆడిషన్స్ లుక్ తరహాలో

By:  Tupaki Desk   |   4 May 2018 9:36 AM GMT
అచ్చు సావిత్రి ఆడిషన్స్ లుక్ తరహాలో
X
తెలుగులో ఎవ‌ర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ‘మ‌హాన‌టి’ విడుద‌ల‌కు ఇంకా ఐదు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అందుకే జ‌నాల్లో క్రేజ్ పెంచేందుకు రోజుకో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తోంది చిత్ర బృందం. తాజాగా సావిత్రి ఆడిష‌న్స్ కోసం తొలిసారి కెమెరా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు ఉన్న స్టిల్ నూ... ఆన్ స్క్రీన్ సావిత్రి కీర్తిసురేష్ స్టిల్‌ నూ జ‌త చేసి విడుద‌ల చేశారు.

1949లోనే ఆడిష‌న్స్ కి హాజ‌ర‌య్యింది మ‌హాన‌టి సావిత్రి. అప్పుడు తెల్ల‌ని చీర‌పై న‌ల్ల‌ని చుక్క‌లతో ఉన్న చీర క‌ట్టుకుని... చిన్న బొట్టుతో సింపుల్ గా వ‌చ్చింది. సింపుల్ లుక్ లోనే కుంద‌న‌పు బొమ్మ‌లా క‌నిపించింది. ఇప్పుడు క‌ట్టూ-బొట్టూ అన్నీ ఒకేలా ఉండేలా ఆన్ స్క్రీన్ సావిత్రి త‌యారైంది. హెయిర్ స్టైల్ ద‌గ్గ‌ర్నుంచి... బొట్టు... చూసే చూపు కూడా ఒకేలా ఉన్నాయి. ఎక్క‌డా ఏ చిన్న తేడా కూడా క‌నిపించ‌డం లేదు. అచ్చుగుద్దిన‌ట్టు దిగిపోయింది కీర్తి. క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసినంత ఈజీగా బ‌యోపిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌లేం. ఆ విష‌యం గ్ర‌హించే తేజ లాంటి వాడే ఎన్‌.టీ.ఆర్ బ‌యోపిక్ చిత్రం నుంచి బ‌యటికి వ‌చ్చేశాడు. ‘ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం’ వంటి ఒకే ఒక్క సినిమా తీసిన నాగ అశ్విన్ సావిత్రి బ‌యోపిక్ తీసే బ‌రువైన బాధ్య‌త‌ను నెత్తినెత్తుకుంటున్నాడంటే... అంద‌రూ భ‌య‌ప‌డ్డాడు.

ఏం తీస్తాడో... ఎలా తీస్తాడో అని! అయితే నాగ అశ్విన్ ప్ర‌తీ విష‌యం మీద ఎంతో శ్ర‌ద్ధ తీసుకుని సినిమా చెక్కుతున్నాడ‌నే విష‌యం పై ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. జూనియ‌ర్ ఎన్‌.టీ.ఆర్ చెప్పిన‌ట్టుగా ద‌ర్శ‌కుడు సావిత్రి ప్ర‌తి విషయం ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమా చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఫోటోల ద్వారా పెంచిన అంచ‌నాల‌ను అందుకుంటే మాత్రం ఓ మ‌రుపురాని ఆణిముత్యం లాంటి సినిమా చూసే అదృష్టం తెలుగు వాళ్ల‌కి ద‌క్క‌నుంది.