Begin typing your search above and press return to search.

రేర్ ఫోటో: సోద‌రి పెళ్లి ప‌ల్ల‌కి బోయిగా మారిన చర‌ణ్

By:  Tupaki Desk   |   5 March 2021 11:30 PM GMT
రేర్ ఫోటో: సోద‌రి పెళ్లి ప‌ల్ల‌కి బోయిగా మారిన చర‌ణ్
X
మెగాస్టార్ చిరంజీవి వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరో హోదాని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. నటించిన రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే ఇండ‌స్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసి.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పూర్తి స్థాయి పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకుంటున్నారు. అక్టోబ‌ర్ లో ద‌స‌రా కానుక‌గా ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగాభిమానుల‌కు అందుబాటులోకి రానుంది.

ఈలోగానే చ‌ర‌ణ్ ఫ్యామిలీ ఈవెంట్ కి చెందిన ఓ రేర్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటో మెగా వెడ్డింగ్ ఆల్బ‌మ్ నుంచి లీకైంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇందులో చ‌ర‌ణ్ నూనూగు మీసాల యువ‌కుడిగా క‌నిపిస్తున్నారు. చిరుత కంటే ముందే తీసిన ఫోటో ఇది. బ‌హుశా త‌న సోద‌రి వివాహంలో ఇలా పెళ్లి ప‌ల్ల‌కి మోస్తూ బోయీ అయ్యాడు చెర్రీ. త‌న‌తో పాటే ఆ ఫోటోలో యంగ్ రానా.. సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఉన్నారు. ప‌ల్ల‌కీ మోస్తున్న బోయీలంతా యంగ్ డైన‌మిక్ హీరోలే కావ‌డం ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుతం ఈ ఫోటో మెగాభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. ఇంత‌కుముందు నిహారిక చిన్న కిడ్ గా ఉన్న మ‌రో ఫోటో కూడా వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తుంటే రానా వ‌రుస‌గా ప‌లు పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్నాడు. సాయి తేజ్ ఇటీవ‌ల వ‌రుస హిట్ల‌తో ట్రాక్ లో ప‌డిన సంగ‌తి తెలిసిందే.