Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కు అరుదైన గౌరవం
By: Tupaki Desk | 30 March 2022 2:30 PM GMT`ట్రిపుల్ ఆర్` ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డుల మోత మోగిస్తోంది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్లని రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన జైత్ర యాత్రని కొనసాగిస్తోంది. ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, భారతీయ సినిమాలో ట్రిపుల్ ఆర్ ఓ అద్భుతం అని విమర్శకులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ఫస్ట్ డే బెనిఫిట్ షో చూసిన మెగా కోడలు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన థియేటర్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సినిమా చూస్తూ అభిమానిలా మారిపోయి పేపర్లు విసిరేస్తూ చాలా ఎంజాయ్ చేసింది. ఆడియన్స్ పై కూడా ఓ దశలో పేపర్లు విసిరి తన భర్త సక్సెస్ ని ఎంజాయ్ చేసిన ఉపాసన తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. స్టార్ సెలబ్రిటీ వైఫ్ గా కాకుండా ఓ సామాజిక సేవకురాలిగా గత కొంత కాలంగా పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారామె.
మన సొసైటీ, పర్యావరణ హితం కోసం అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురికి అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా హ్యుమన్ లైఫ్ తో పాటు వైల్డ్ లైఫ్ ని కూడా కాపాడాలనే ఉద్దేశ్యంతో పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఓ పక్క సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న ఉపాసనకు తాజాగా అరుదైన పురస్కారం దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్ చేస్తున్న కృషికి 2022 ఏడాదికి గానూ ఉపాసనకు ప్రతిష్టాత్మక `నాట్ హోల్త్ సీఎస్ ఆర్` అవార్దు దక్కింది.
ఓ గొప్ప కార్యక్రమంలో తమని భాగం చేసిన తాతయ్య అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ పురస్కార ఘనత దక్కుతుందని ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల అన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవల్ని మెరుగుపరచాలన్న తాతయ్య లక్ష్యమే తనకు స్ఫూర్తి అని వెల్లడించారు. చరణ్ `ట్రిపుల్ ఆర్`తో పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న వేళ ఉపాసన ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ఆనందంగా వుందని అభిమానులు మురిసిపోతున్నారు.